శ్రీలంకకు కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమ సింఘే

అమరావతి: శ్రీలంకకు కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమ సింఘే ఎన్నికయ్యారు.. ప్రస్తుతం దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆయనకే పార్లమెంటు సభ్యులు పట్టం కట్టారు..శ్రీలంక పార్లమెంటులో మొత్తం 219 మంది ఎం.పీలు వుండగా, 134 మంది ఆయనకు అనుకూలంగా ఓటు వేయడంతో,,శ్రీలంక 8వ అధ్యక్షుడిగా రణిల్ బాధ్యతలను స్వీకరించనున్నారు.. ఆయన అధ్యక్ష పదవిలో 2024 నవంబరు వరకు కొనసాగనున్నారు. లంక పార్లమెంటు సభ్యులు తమ దేశాధ్యక్షుడిని నేరుగా ఎన్నుకోవడం 44 ఏళ్లలో ఇదే మొదటిసారి.. రణిల్ విక్రమ సింఘే శ్రీలంకకు ఆరుసార్లు ప్రధానమంత్రిగా వ్యవహరించారు.. రాజకీయాల్లోకి రాకముందు జర్నలిస్టు, న్యాయవాదిగా పనిచేశారు. 1977లో సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారిగా రణిల్ పార్లమెంటు సభ్యుడు అయ్యారు..1993లో తొలిసారిగా ప్రధాని అయ్యారు..