రాబోయే రెండు రోజుల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు-విపత్తుల నిర్వహణ సంస్థ

అమరావతి: వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా-ఉత్తరాంధ్ర తీరప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని,,రాబోయే రెండు రోజుల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది..వ్యాయుగుండం ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా క్రమంగా పశ్చిమ-వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని,, దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాలలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.. సోమ,మంగళవారాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,,రెండు రోజుల పాటు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని సూచించింది..