MOVIE

సినీ నేపధ్య గాయని వాణీ జయరాం కన్నుమూత

నెల్లూరు: ప్రముఖ సినీ నేపధ్య గాయని వాణీ జయరాం చెన్నైలోని ఆమె స్వగృహంలో కన్నుమూసినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు..ఐదు దశాబ్దాలుగా సినీ సంగీత ప్రియుల్ని తన మధురగానంతో ఓలలాడించిన వాణీ జయరాం గొంతు మూగబోయింది..పదేళ్ల వయస్సులోనే మొదటిసారి ఆల్ ఇండియా రేడియాలో పాటలు పాడిన వాణీ జయరాం,, 1970లో ‘గుడ్డీ’ చిత్రంలో తొలిపాటను పాడారు..ఆమె ఆలిపించిన తొలిపాటకే తాన్‌సేన్‌తో పాటు మరో నాలుగు అవార్డులను అందుకున్నారు..తెలుగు శ్రోతలను ‘అభిమానవంతుడు’ అనే సినిమాలోని పాటలతో పలకరించింది.. బాలచందర్ దర్శకత్వం వహించిన అపూర్వ రాగంగళ్ చిత్రానికి జాతీయ పురస్కారం అందుకున్నది..‘శంకరాభరణం’ చిత్రంలోని మానస సంచరరే పాటకు రెండోసారి జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు..‘స్వాతికిరణం’ చిత్రంలోని ‘‘ఆనతినియ్యరా హరా..’’ పాటకు మూడోసారి ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డును అందుకున్నారు..ఆమె నేపథ్యగాయనిగా 50 ఏళ్ల సినీ జీవితాన్ని ఇటీవల విజయవంతంగా పూర్తి చేసుకున్నారు..ఆమె కెరీర్‌లో తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, ఉర్దూ, మరాఠీ, బెంగాలీ, భోజ్‌పురి, ఒరియా భాషలతో పాటు మొత్తంగా 18 భాషల్లో పాటలను పాడారు..దాదాపు వేయి సినిమాల్లో 10 వేల పాటలను పాడారు..ఇటీవల ఆమెకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది..వాణీ జయరాం మరణవార్త గురించి తెలుసుకున్న ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *