AMARAVATHIPOLITICS

రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్‌ ఇవ్వాలనేదే మా ఉద్దేశం-బాబు,పవన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ను అన్ని విధాల అభివృద్ది చెందిన రాష్ట్రంగా నిలబెట్టాలనేదే మా సంకల్పం,, అవసరమైతే ఏ త్యాగాలకైనా మేం సిద్ధం అని టీడీపీ అధినేత చంద్రబాబు,,జనసేన అధ్యక్షడు పవన్ కళ్యాణ్ లు అన్నారు..బుధవారం తాడేపల్లిగూడెం వేదికగా జరిగిన తెలుగు జన విజయ కేతనం(జెండా) సభలో చంద్రబాబు మాట్లాడుతూ జగన్‌ ఒక బ్లఫ్‌ మాస్టర్‌,,పదేపదే అబద్ధాలు చెప్తుంటారు,, సొంత బాబాయిని ఎవరు చంపారో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. వైసీపీ వై నాట్‌ 175 అంటున్నారని,,మేము వై నాట్ పులివెందుల అంటున్నమని అన్నారు..జగన్‌ తన పాలనలో అందరినీ బాధపెట్టాడు, అవమానించాడు,,ఇందులో సినిమా టికెట్ల పేరుతో చిరంజీవి,, రాజమౌళిని అవమానించారన్నారు..టీడీపీ-జనసేన కూటమి సభతో తాడేపల్లి ప్యాలెస్‌ కంపించిపోతోందన్నారు..రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వైసీపీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు..త్వరలోనే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని,,భవిష్యత్‌కు నాంది పలకాల్సిన బాధ్యత మనమై ఉందన్నారు.. ఎన్నిలకు ముందు ముద్దులు పెట్టిన జగన్‌,, ఎన్నికల తర్వాత జర్నలిస్టులను కూడా వదల కుండా పిడిగుద్దులు కురిపిస్తున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు..

పవన్ కళ్యాణ్ :- సీఎం జగన్ పై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు..జగన్‌, నేనూ తెలుగు మీడియంలోనే చదువుకున్నాను,, సంస్కారం ఉన్నందునే నీలా మాట్లాడలేకపోతున్నా,, ఓ సామాన్యుడు రాజకీయాలు చేస్తే తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు..5 రెడ్ల కోసం 5 కోట్ల మంది ప్రజలు తిప్పలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు..శక్తి సామర్థ్యాలు చూసుకునే 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాలకు ఒప్పుకున్నాం,, టీడీపీ-జనసేన సహకారంతోనే ప్రజలకు భవిష్యత్‌ ఉంటుందన్నారు.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే పొత్తులు పెట్టుకున్నమని,, టీడీపీ-జనసేన సహకరించుకుంటేనే ప్రజలకు భవిష్యత్‌ ఉంటుందని భరోస ఇచ్చారు.. ప్రశ్నించే వారిపై వైసీపీ దాడులు చేస్తోందని, వైసీపీ గూండాయిజానికి కార్యకర్తలు భయపడవద్దు.,,మా సభలు, నాయకులపై వైసీపీ గూండాలు దాడులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు..నిన్ను అధఃపాతాళానికి తొక్కే వామనుడి పాదం నేను…జగన్‌ కోటలు బద్ధలు కొడతాం… సిద్ధం సిద్ధం అంటున్నావ్.. కానీ నీకు నేను యుద్ధాన్ని ఇస్తున్నా అంటూ వ్యాఖ్యనించారు..రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్‌ ఇవ్వాలనేదే మా ఉద్దేశమని,,25 కిలోల బియ్యం ఇచ్చేందుకు కాదన్నారు.. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారిందని ఆ రోడ్లపై వెళ్లాలంటే రోజులు గడిచిపోయే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు..రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు, వర్గాలను జగన్‌ మోసం చేశారని దుయ్యబట్టారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *