రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని సాధించిన పడుగుపాడు గ్రామ పంచాయతీ

నెల్లూరు: విద్యుత్ పొదువు ప్రత్యామ్నాయ వనరుల సమీకరణ అంశంలో భాగంగా రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని సాధించిన కోవూరు మండలం, పడుగుపాడు గ్రామ పంచాయతీని జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు అభినందించారు. విద్యుత్ పొదుపు ప్రత్యామ్నాయ వనరుల సమీకరణలో భాగంగా పడుగుపాడు పంచాయతీ సచివాలయంలో సోలార్ వ్యవస్థతో పాటు బ్యాటరీ ఆటోను, సోలాట్ లైట్ల ను ఏర్పాటు చేయడం వలన రాష్ట్ర స్థాయి పురస్కారానికి ఎంపిక కాబడి ఈ నెల 20వ తేదీన విద్యుత్ శాఖ వారు విజయవాడలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఇంచార్జి డి.పి.ఓ చిరంజీవి, పడుగుపాడు గ్రామ ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఎనర్జీ అసిస్టెంట్ లతో కలసి అవార్డును అందుకోవడం జరిగింది. విజయవాడలో అవార్డు స్వీకరించిన వీరు గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ చక్రధర్ బాబును మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా వీరిని,కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.