DISTRICTS

ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలి-కలెక్టర్ చక్రధర్ బాబు,

నెల్లూరు: జిల్లాలో జరగనున్నఎమ్మెల్సీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ చక్రధర్ బాబు,  ఎన్నికల నోడల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో  ప్రకాశం–నెల్లూరు-చిత్తూరు పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ,,నెల్లూరు లోకల్ అథారిటీస్ ఎమ్మెల్సీ ఎన్నికల  నిర్వహణపై  కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్ తో కలిసి సమీక్షించారు. జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి  129 పోలింగ్ కేంద్రాలను, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 40 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. అలాగే నెల్లూరు లోకల్ అథారిటీస్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 5 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ఎన్నికల  ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలు పరిచేందుకు ఎంసిసి, అకౌంటింగ్ టీమ్స్ ఏర్పాటు చేసుకోవడంతో పాటు  అవసరమైన శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని  సూచించారు. ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన అన్ని వసతులతో పాటు.. భద్రతా ఏర్పాట్లను కూడా పటిష్టంగా చేపట్టాలన్నారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల నుండి సిబ్బంది వివరాలు తెప్పించుకొని ఎన్నికల విధులు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. స్ట్రాంగ్ రూము, డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ కౌంటర్లు, ఎన్నికల ప్రక్రియకు సంబంధించి పోలింగ్ మెటీరియల్,బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్, బ్యాలెట్ బాక్స్ లు  అన్నీ సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్, సంబంధిత నోడల్ అధికారులను ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి వీడియోగ్రాఫర్, సూక్ష్మ పరిశీలకులను  నియమించాలన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ.. గతంలో నిర్వహించిన ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జరగబోయే ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు నోడల్ అధికారులందరికి కేటాయించిన విధులను తప్పక పాటించాలన్నారు. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *