4వ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ప్రారంభించిన ప్రధాని మోదీ

అమరావతి: హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా రైల్వే స్టేషన్ నుంచి 4వ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ గురువారం జెండా ఊపి ప్రారంభించారు. వందే భారత్ రైలు హిమాచల్ ప్రదేశ్‌లోని అంబ్ అందౌరా నుంచి ఢిల్లీ వరకు నడుస్తుంది. హిమాచల్ ప్రదేశ్ నుంచి నడిచే తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్.. బుధవారం ఒక్క రోజు మినహా, ఈ ట్రైన్ వారంలో మిగిలిన అన్ని రోజులలో సేవాలు అందిస్తుంది.ఈ రైలు హిమాచల్ నుంచి ఢిల్లీకి ప్రయాణించడానికి కేవలం 5 గంటల సమయం పడుతుంది. ఢిల్లీ, చండీగఢ్ మధ్య మూడు గంటల్లో ప్రయాణం చేయవచ్చు.ఇప్పటికే దేశంలో 3 వందేభారత్ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించారు. అంబాలా, చండీగఢ్, ఆనంద్‌పూర్ సాహిబ్, ఉనా స్టేషన్స్ లో ఆగుతుంది. ఇది కేవలం 52 సెకన్లలో గంటకు 100 కి.మీ. వేగంను రైలు అందుకుంటుంది.
प्रधानमंत्री श्री @narendramodi जी ने आज हिमाचल के ऊना स्टेशन से, अम्ब अन्दौरा और नई दिल्ली के बीच “वंदे भारत” ट्रेन को हरी झंडी दिखाकर शुभारंभ किया।
इस वंदे भारत एक्सप्रेस के माध्यम से हिमाचल के पर्यटन एवं तीर्थाटन को बढ़ावा मिलने के साथ ही अर्थव्यवस्था को भी मजबूती मिलेगी। pic.twitter.com/iT0Mi6Bdhc
— Sambit Patra (@sambitswaraj) October 13, 2022