సోమశిల రిజర్వాయర్‌కు అకస్మాత్తుగా భారీ ఇన్‌ఫ్లోల హెచ్చరిక

నెల్లూరు: ఆదినిమ్మాయపల్లి ఆనకట్ట నుంచి పెన్నా నదికి ప్రస్తుతం 23000 క్యూసెక్కుల ప్రవహిస్తున్నందున సోమశిల జలాశయానికి ప్రస్తుతం ఉన్న 15000 క్యూసెక్కుల ఇన్ ఫ్లోలకు అదనంగా 30000 క్యూసెక్కుల నుండి 50000 క్యూసెక్కుల వరకు మరింత పెరుగుతుందని సోమశిల డివిజన్-1 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గురువారం తెలిపారు. సోమశిల రిజర్వాయర్ క్రెస్ట్ గేట్ల నుంచి ఎప్పుడైనా పెన్నా నదిలోకి 30000 క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని ప్రతిపాదించబడిందని, అప్‌స్ట్రీమ్ నుంచి వచ్చే ఇన్‌ఫ్లోలను బట్టి ఔట్‌ఫ్లోలను మరింత పెంచే ఆవకాశలు వున్నయన్నారు. పెన్నా నది ఒడ్డున నివసించే సంబంధిత అధికారులు, ప్రజలు, పిల్లలు, గ్రామస్తులు పెన్నా నదిలోకి ప్రవేశించవద్దని, పెన్నా నది వెంబడి అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు.