ఉప రాష్ట్రపతి ఎన్నికకు జరుగుతున్న పోలింగ్

అమరావతి: భారతదేశ 16వ ఉప రాష్ట్రపతి ఎన్నికకు శనివారం ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.. పార్లమెంట్ భవనంలో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది..NDA కూటమి తరపున పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్ (71),, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి మార్గరెట్ అల్వా(80) పోటీ పడుతున్నారు..ఈ ఎన్నికకు దూరంగా ఉండాలని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడంతో,, TMC మినహా లోక్‌సభకు చెందిన 543, రాజ్యసభకు చెందిన 245 మంది ఎన్నికలో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ మొదలుపెట్టి రాత్రికి ఫలితాలు వెల్లడిస్తారు..ఈ నెల 11వ తేదీన కొత్త ఉప రాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేయనున్నారు..ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10వ తేదితో ముగియనుంది..12వ తేదీవరకు పార్లమెంటు జరుగనున్నందున చివరి రోజు కొత్త ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఛైర్మన్ హోదాలో సభను నిర్వహించే అవకాశం ఉంది..