AMARAVATHINATIONAL

దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైలో అత్యంత పొడ‌వైన వంతెన‌ను ప్రారంభించి ప్ర‌ధాని మోదీ

అమరావతి: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నిర్మించిన అత్యంత పొడవైన వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు.. దేశంలో సముద్రంపై నిర్మించిన వంతెనల్లో ఇదే అతి పెద్దది..ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్ గఢ్ జిల్లాలోని నవా శేవాను, ముంబై ట్రాన్స్ హార్బర్ ను కలుపుతుంది..ఈ వంతెనకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి గౌరవార్థం “అటల్ సేతు” అని పేరు పెట్టారు.. ఆరు లైన్లుగా నిర్మించిన ఈ వంతెన వ్యయం రూ.21,200 కోట్లు.. వంతెన మొత్తం పొడవు 21.8 కిలోమీటర్లు,,16 కి.మీలపైగా అరేబియా సముద్రంపైనే వంతెన ఉంటుంది..ముంబై,, నవీ ముంబైల మధ్య ప్రయాణ 2 గంటల కన్నా ఎక్కువ సమయం పడుతుండగా,,వంతెన అందుబాటులోకి రావడంతో కేవలం 15 నుంచి 20 నిమిషాల్లోనే చేరుకోవచ్చు..ఈ వంతెన నిర్మాణంలో వుపయోగించిన సరికొత్త సాంకేతికత కారణంగా భూకంపాలను సైతం తట్టుకుంటుంది.. 2016 డిసెంబర్లో ఈ వంతెనకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు..వాహనదారుల భద్రత కోసం 400 సీసీకెమెరాలను ఏర్పాటు చేశారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది లిగినా వెంటనే కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ కు సమాచారం అందుతుంది.. బైకులు, ఆటో రిక్షాలు, ట్రాక్టర్లకు ఈ బ్రిడ్జిపైకి వెళ్లేందుకు అనుమతి లేదు.. కార్లు,,టాక్సీలు,, మీడియం రేంజ్ వాహనాలు,,మినీబస్సులను అనుమతిస్తారు.. ఈ బ్రిడ్జిపై వాహనాలు గంటలకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *