AMARAVATHINATIONAL

ఈ సంవత్సరం వర్షపాతం సాధారణం కంటే తక్కువ,ఎండలు ?

అమరావతి: ఎల్ నినో ప్రభావంతో 2023లో దేశంలో సాధారణం వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది..ఆసియాలో ఎల్-నినో సంభావ్యత పెరుగుతూ వస్తోందని,,ఇది రుతుపవనాలపై తీవ్ర ప్రభావం చూపనున్నట్టు తెలిపింది.. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు రుతుపవనాలు సాధారణం కంటే తక్కువగా 868.6 మిల్లీమీటర్లు మేర నమోదవుతాయని వాతావరణ సంస్థ అంచనా వేసింది..రాబోయే రోజుల్లో ఈ రుతుపవనాల వర్షాలు ధీర్ఘకాలిక సగటులో 94 శాతం అంటే సాధారణం కంటే తక్కువగా ఉండవచ్చని స్కైమెట్  తెలిపింది..

దేశంపై ఎల్ నినో ప్రభావం:- ఎల్ నినో తీవ్రతను బట్టి వాతావరణంలో మార్పులు సంభవించవచ్చు..ఇది భారతదేశంలోని పలు ప్రాంతాలపై ప్రభావం చూపించవచ్చు..ముఖ్యంగా దక్షిణ, పశ్చిమ ప్రాంతాలలో ఇది కరువు పరిస్థితులకు దారితీసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది..ఇదే సమయంలో వ్యవసాయంపై గణనీయమైన ప్రభావాన్ని చూపనున్నట్టు రికార్డులు తెలియచేస్తున్నాయి..దేశంలోని సగం మేరకు వ్యవసాయ భూములు జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కురిసే వానాలపైనే ఆధారపడతాయి..పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తర భారత వ్యవసాయ “బౌల్” గా పేరువున్న ఉత్తరప్రదేశ్‌లలో  సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనాలు వున్నాయి..అకాల వర్షాలు, వడగండ్ల వానలు ఇప్పటికే భారతదేశంలోని సారవంతమైన ఉత్తర, మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో శీతాకాలంలో పండించిన గోధుమ వంటి పంటలను దెబ్బతీశాయి..దీని కారణంగా వేలాది మంది రైతులు నష్టాలకు గురయ్యారు.

భూమధ్య రేఖ వెంబడి పసిఫిక్ మహా సముద్రం ఉపరితలంపై అసాధారణ వేడి లేదా చల్లదనం లాంటి పరిస్థితులు నమోదు అవుతాయి.ఇలాంటి పరిణామాలను ఎల్ నినో సదరన్ ఆసిలేషన్ సిస్టం(ENSO) అని పిలుస్తారు.. ENSO పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలను,,వర్షపాతాలను ప్రభావితం చేస్తాయి..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *