AMARAVATHINATIONAL

సిపిఐ,టీఎంసి,ఎన్సీపీలకు జాతీయ పార్టీ హోదాను తొలగించిన కేంద్ర ఎన్నికల సంఘం

అమరావతి: దేశంలో మూడు జాతీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం,జాతీయ పార్టీ హోదాను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది..CPI,, TMC,,NCP పార్టీలు జాతీయ పార్టీ హోదా కోల్పోయినట్లు ప్రకటించింది..2019 జులైలో CPI, TMC, NCP పార్టీలకు కేంద్రం ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది..ఆదే సంవత్సరం లోక్‌సభ ఎన్నికల్లో తమ పనితీరు తరువాత ఆయా పార్టీల జాతీయ పార్టీ హోదాను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని వివరణ కోరింది..నేడు మూడు పార్టీల జాతీయ హోదా రద్దు చేసింది.. 

జాతీయ హోదా దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ:- ఇదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ హోదా పార్టీ కల్పిస్తున్నట్లు  ప్రకటించింది..ఇటీవల కాలంలో అనేక రాష్ట్రాల్లో ఎన్నికల్లో  ఓట్ల శాతాన్ని పెంచుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీ హోదా కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి ఏప్రిల్ 13లోగా ఉత్తర్వులు జారీ చేయాలని గత వారం కర్ణాటక హైకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

రాష్ట్ర పార్టీ హోదా రద్దు: – పశ్చిమ బెంగాల్‌లో రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీకి రాష్ట్ర పార్టీ హోదాను రద్దు చేసింది..ఆంధ్రప్రదేశ్‌లో BRSకు రాష్ట్ర పార్టీ గుర్తింపును కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది..మణిపూర్లో PDA, పుదుచ్చేరిలో PMK పార్టీల రాష్ట్ర హోదాను కూడా రద్దు చేసింది..మరోవైపు మేఘాలయలో వాయిస్ ఆఫ్ పీపుల్ పార్టీకి రాష్ట్ర పార్టీ హోదా కల్పించింది..నాగాలాండ్‌లో లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందింది..త్రిపురలో రాష్ట్ర పార్టీగా టిప్ర మోత పార్టీకి గుర్తింపు దక్కింది. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *