AMARAVATHINATIONAL

ప్రజల నుంచి వసూలు అయిన పన్నులను తిరిగి వారి అభివృద్ధికే-ప్రధాని మోదీ

అమరావతి: ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు అయిన నగదు మొత్తం తిరిగి వివిధ పథకాల రూపంలో వారి అభివృద్ధికి కేటాయించడం జరుగుతుందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు..మంగళవారం మధ్యహ్నం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి చేరుకున్నారు..పుట్టపర్తి విమానాశ్రాయంలో ప్రధానికి రాష్ట్ర ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది..ఎయిర్ పోర్టు నుంచి లేపాక్షి ఆలయానికి చేరుకున్న ప్రధాని మోదీకి, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు..లేపాక్షిలో వీరభద్రస్వామి,, దుర్గా దేవిలకు ప్రధాని ప్రత్యేక పూజలు చేశారు..ఆలయం విశిష్టతను లేపాక్షి శిల్పకళా సంపదను ప్రధానికి ఆలయ అధికారులు వివరించారు.. శ్రీరామ భజనతో పాటు సంగీత కచేరిని మోదీ వీక్షించారు..శిల్ప కళా సంపదను లేపాక్షి స్థల పురాణాన్ని అడిగి తెలుసుకున్నారు..ఆలయంలో వేలాడే స్తంభాన్ని మోదీకి ఆలయ అధికారులు ప్రత్యేకంగా చూపించారు..లేపాక్షి ఆలయం ప్రాంగణం చుట్టూ శిల్పకళా సంపదను అలాగే ఆలయంలో ఏర్పాటు చేసిన తోలుబొమ్మలాటను మోదీ వీక్షించారు..అనంతరం సత్యసాయి జిల్లాలోని గోరంట్ల మండలం పాలసముద్రంకు చేరుకున్న ప్రధాని, నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్(నాసిన్) సెంటర్ ను ఆయన ప్రారంభించారు..503 ఎకరాల విస్తీర్ణంలో ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ కు సంబంధించిన శిక్షణా కేంద్రానికి 2015లో కేంద్ర మంత్రులు శంకుస్థాపన చేశారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *