AMARAVATHIDISTRICTS

పీఎం సూరజ్ జాతీయ పోర్టల్‌ని ప్రారంభించిన గవర్నర్

నెల్లూరు: సమాజంలో వెనుకబడిన వర్గాలైన సఫాయీ కర్మచారీ లబ్ధి దారులకు NSFDC స్త్రీ నిధి,NSKFDC, ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు, పి పి ఈ కిట్లు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అందజేశారు. బుధవారం స్థానిక కస్తూర్బా కళాక్షేత్రంలో ప్రధానమంత్రి సూరజ్ జాతీయ పోర్టల్ ప్రారంభ కార్యక్రమంలో అయన పాల్గొన్నారు. గవర్నర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులతో ప్రధానమంత్రి జరిపిన ఇంటర్ యాక్షన్ ను గవర్నర్ వీక్షించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి , జమ్ము కాశ్మీర్, మహారాష్ట్ర పంజాబ్ రాష్ట్రాల్లోని  లబ్ధిదారులతో ప్రధానమంత్రి వారికి అందుతున్న పథకాలు వారి జీవితాల్లో కలిగిన మార్పును తెలుసుకున్నారు. మన రాష్ట్రం లోని గుంటూరు జిల్లా నుండి ఒక సఫాయి కార్మికురాలు ప్రధాని మోడీతో మాట్లాడారు.

పీఎం సూరజ్ జాతీయ పథకంలో జిల్లాలో766 మందికి ఈ పథకం అందజేయబడుతుని కలెక్టర్ అన్నారు.NSFDC 296 మంది, NSKFDC లు 25 మంది ,NBCFDC పథకంలో 356 మంది ,నమస్తే పథకంలో 89 మంది పొందుతున్నారని, ఆయుష్మాన్  భారత్ హెల్త్ కార్డులు 50 మందికి, మరో 50 మందికి PPA కిట్లు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *