x
Close
DEVOTIONAL NATIONAL

అయోధ్యకు చేరుకున్న సాలగ్రామ శిలలు

అయోధ్యకు చేరుకున్న సాలగ్రామ శిలలు
  • PublishedFebruary 2, 2023

అమరావతి: అయోధ్య రామా మందిరంలో ప్రతిష్టించనున్న శ్రీరాముడు, జానకిదేవీ విగ్రహాలు తయారు చేయడం కోసం నేపాల్ నుంచి సాలగ్రామ శిలలు అయోధ్యకు చేరుకున్నాయి..పూజారులు, స్థానికులు వాటికి పూలమాలలు వేసి  పూజ‌లు చేశారు..అనంతరం వాటిని శ్రీ రామ జ‌న్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అంద‌జేశారు..అయోధ్య మొత్తం జై  శ్రీరామ్ అనే నామస్మరణతో మారుమ్రోగింది.. నేపాల్‌లోని  జనక్‌పూర్ నుంచి హెవీ డ్యూటీ ట్రక్కుల ద్వారా వీటిని అయోధ్యకు తరలించారు..ఇందులో ఒకటి 18 టన్నులు మరొకటి 16 టన్నుల బరువు ఉంది.. నేపాల్‌లోని గండ‌కీ న‌ది స‌మీపంలో ల‌భించే ఈ శిలలను విష్ణు భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు..60 మిలియన్ల వయసున్న ఈ శిలలతోనే రాముడు,, సీత,,లక్ష్మణ,, అంజనేయ విగ్రహాలను తయారుచేయనున్నారు.. 2024 జనవరి నాటికి రాముడి దర్శనం కల్పిస్తామని  కేంద్రప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది..సీతా మాత జన్మస్థలం నేపాల్ లోని జనక్‌పూర్ అనే విషయం విదితమే..ఈ సాలగ్రామాలను మొదట నేపాల్‌లోని కాళీ గండకి, గాలేశ్వర్ నుంచి ఆ దేశంలోని జనక్‌పుర్‌ధామ్‌లో ఉన్న జానకి మాత దేవాలయానికి తీసుకెళ్లడం జరిగిందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్  తెలిపారు.. శ్రీరాముని మూర్తులను తయారు చేసేందుకు సాలగ్రామాలు అనేక నగరాల గుండా అయోధ్యకు చేరుకున్నాయన్నారు.

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.