AMARAVATHIDISTRICTS

పారిశుద్ద్యం నిర్వహణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన-కమిషనర్ వికాస్ మర్మత్

నెల్లూరు: నగర వ్యాప్తంగా పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి స్వచ్ఛ నెల్లూరు సాకారానికి కృషి చేయాలని అధికారులు, సచివాలయ కార్యదర్శులను నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ ఆదేశించారు.స్థానిక 42, 48 డివిజనుల సచివాలయాలలో శానిటేషన్ సిబ్బంది హాజరు రికార్డులను కమిషనర్ పరిశీలించారు. సెలవులలో ఉన్న సిబ్బంది నుండి విధులకు హాజరుకాని కారణంపై వివరణ తీసుకోవాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక బోడిగాడి తోట డంపింగ్ యార్డులో చెత్త సేకరణ, తరలింపు వాహనాలకు సంభందించిన రికార్డులను పరిశీలించారు. పరిసర ప్రాంతాలలో వాహనాల ద్వారా డోర్ టు డోర్ తడి, పొడి చెత్త సేకరణ పనులను అధికారులతో కలిసి కమిషనర్ గురువారం పర్యవేక్షించారు. స్థానికంగా ఉన్న వివిధ వీధుల్లో డ్రైను కాలువల్లో పూడికతీత పనులు చేపట్టాలని, దోమల నిర్మూలనకు మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దోమల నివారణా చర్యల్లో భాగంగా అన్ని డ్రైను కాలువల్లో ఆయిల్ బాల్స్ పిచికారీ చేయాలని, క్రమం తప్పకుండా ఫాగింగ్ పనులు నిర్వహించాలని కమిషనర్ సూచించారు. నగర పాలక సంస్థ అందజేసిన చెత్త బుట్టలలో తడి, పొడి చెత్తను విడిగా తీసి ఉంచాలని, రీ సైక్లింగ్ విధానానికి ప్రజలంతా బాధ్యతగా సహకరించాలని కమిషనర్ కోరారు. అనంతరం పాత మున్సిపల్ కార్యాలయం సమీపంలోని వెహికల్ షెడ్డును కమిషనర్ సందర్శించారు. నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో డ్రైను కాలువల్లో పూడికతీత, సిల్ట్ తొలగింపు పనులను వేగవంతం చేయాలని సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ శానిటేషన్ విభాగ అధికారులు, సచివాలయ కార్యదర్శులు,సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *