AMARAVATHICRIME

కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ కూతురు వీణ‌ విజ‌య‌న్ పై మ‌నీల్యాండ‌రింగ్ కేసు నమోదు

అమరావతి: కేర‌ళ (కమ్యూనిస్టుపార్టీ) ముఖ్యమంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ కూతురు వీణ‌ విజ‌య‌న్ పై ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్ట‌రేట్ మ‌నీల్యాండ‌రింగ్ కేసును బుధవారం న‌మోదు చేసింది.. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్  ( SFIO) ప్రారంభించిన విచారణకు వ్యతిరేకంగా ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు గత నెలలో కొట్టివేసింది.. వీణాకు చెందిన ఐటీ కంపెనీ మ‌నీల్యాండ‌రింగ్‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.. అక్ర‌మంగా చెల్లింపులు చేసిన‌ట్లు వీణాపై విమ‌ర్శ‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే..కమ్యూనిస్టు పార్టీ ముఖ్యమంత్రి పినరై విజ‌య‌న్ కూతురు వీణా విజయన్ కు ఎక్సాలాజిక్ అనే కంపెనీ ఉన్న‌ది..

కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (SFIO) దాఖలు చేసిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని ఈడీ కేసు నమోదు చేసినట్లు సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి..

కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ (CMRL) అనే ప్రైవేట్ కంపెనీ 2018 నుండి 2019 వరకు వీణా కంపెనీ, Exalogic సొల్యూషన్స్ కి 1.72 కోట్ల రూపాయల అక్రమ చెల్లింపు చేసిందని ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తులో తేలింది..వీణాకు చెందిన ఐటీ సంస్థ,, కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ కంపెనీకి ఎలాంటి సేవలు అందించక పోయిన ఆక్రమ మాగ్గంలో డబ్బులు వసూలు చేసిందని ఆరోపణలు వున్నాయి..ప్రాథమిక దర్యాప్తులో ఈ మొత్తం బయట పడింది,,లోతుగా దర్యప్తు ప్రారంభం అయింతే ఇంకా ఎన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాలి ?.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *