AMARAVATHINATIONAL

లండన్ కు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నఅమృత్‌పాల్‌ సింగ్‌ భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు

అమరావతి: ‘వారిస్‌ పంజాబ్‌ దే’ నేత,,ఖలిస్థానీ నాయకుడు అని చెప్పుకునే అమృత్‌పాల్‌ సింగ్‌, భార్య కిరణ్‌దీప్‌ కౌర్‌ లండన్ కు వెళ్లేందుకు ప్రయత్నించగా విమానాశ్రయంలో ను పంజాబ్ పోలీసులు అధికారులు అడ్డుకున్నారు..బ్రిటన్‌ విమానం ఎక్కేందుకు గురువారం ఆమె అమృత్‌సర్‌ లోని శ్రీ గురు రామ్ దాస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లారు..అప్పటికే అమెపై లుక్‌ ఔట్‌ నోటీసులు జారీ చేయడంతో, ఇమిగ్రేషన్‌ అధికారులు ఈ విషయాన్ని గుర్తించారు.. వెంటనే కిరణ్‌దీప్‌ కౌర్‌ లండన్ కు వెళ్లెందుకు విమానశ్రయంకు వచ్చిన విషయం గురించి పంజాబ్ పోలీసులకు తెలియజేశారు..ఆమె ప్రయాణానికి పంజాబ్ పోలీసులు అనుమతి నిరాకరించడంతో పాటు కిరణ్‌దీప్‌ కౌర్‌ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం..ఖలీస్థాన్ వేర్పాటువాద ఉద్యమంలో “అమృత్‌పాల్‌ సింగ్‌”భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి..? అనే విషయాలపై కిరణ్‌దీప్‌ ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.. 

కిరణ్‌దీప్ కౌర్‌ కు బ్రిటిష్‌ పౌరసత్వం వుంది..అమృత్‌పాల్ భార్య కిరణ్‌దీప్ కౌర్ లండన్ లో ఉంటూ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌లో క్రియాశీలక సభ్యురాలిగా ఉన్నారు..పరారీలో ఉన్న నిందితుల కుటుంబం, పరిచయస్తులను ప్రశ్నించే సెక్షన్ కింద ఇమ్మిగ్రేషన్ అధికారులు కిరణ్‌దీప్ కౌర్‌ను ముందు జాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకున్నారు..గత మార్చిలో అమృతపాల్ సింగ్ కార్యకలాపాలకు విదేశీ నిధులు సమకూర్చిన ఆరోపణలపై కిరణ్‌దీప్ కౌర్‌ను జల్లుపూర్ ఖేడా గ్రామంలో పోలీసులు ప్రశ్నించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *