సీనియర్ నటుడు ప్రతాప్ పోతన్ కన్నుమూత

అమరావతి: సీనియర్ నటుడు ప్రతాప్ పోతన్(70) కన్నుమూశారు.. గురువారం అర్ధరాత్రి గుండెపోటుతో చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు..ఆయన మరణవార్త తెలుసుకుని సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది.. ప్రతాప్ పోతెన్1952 ఆగస్టు 13న జన్మించారు.. ముంబయిలోని ఓ యాడ్ ఏజెన్సీలో కాపీ రైటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు..సీనియర్ నటి రాధికను పెళ్లి చేసుకున్నారు..కొంతకాలానికి ఈ జంట విడకులు తీసుకుంది..అనంతరం అమలా సత్యనాథ్‌ను రెండో వివాహం చేసుకున్నారు..తెలుగులో మరో చరిత్ర, ఆకలిరాజ్యం, డబ్బు డబ్బు డబ్బు, అమాయకుడు కాదు అసాధ్యుడు, కాంచనగంగ లాంటి మరెన్నో చిత్రాల్లో నటించారు. నాగార్జున నటించిన చైతన్య’ చిత్రానికి దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు డజనుకు పైగానే చిత్రాలకు దర్శకత్వం వహించారు.