గోటబాయ రాజపక్స రాజీనామా అమోదం-స్పీకర్ మహింద

అమరావతి: శ్రీలంక నుంచి పారిపోయిన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామాను అంగీకరించినట్లు శ్రీలంక పార్లమెంట్ స్పీకర్ మహింద యాప అభయవర్దెన శుక్రవారం ప్రకటించారు..కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు సంబంధించిన చట్టపరమైన ప్రక్రియను మొదలుపెడతామని వెల్లడించారు..వారంలోగా ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుందన్నారు..ఈ ప్రక్రియలో భాగంగా శనివారం ఉదయం 10 గంటలకు పార్లమెంటును సమావేశపరుస్తామని పేర్కొన్నారు.. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘె తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతారని స్పష్టం చేశారు..గొటబాయ రాజపక్స జులై 13వ తేదిన శ్రీలంక నుంచి పరారైన తరువాత సేఫ్ గా సింగపూర్ కు చేరుకున్న తరువాత ఆయన రాజీనామా లేఖను గురువారం ఈమెయిల్ ద్వారా స్పీకర్ కు పంపారు..