హైదరాబాద్: తెలుగు సినిమా రంగంలో ఆలనాటి మేటి నటులు,నటీమణులు జీవితం నుంచి నిష్కారమిస్తున్నారు.. సీనియర్ నటి జమున శుక్రవారం ఉదయం 7 గంటలకు హైదరాబాద్ లోని తన స్వగృహంలో కన్నుమూశారు..1936 ఆగష్టు 30న కర్ణాటక హంపీలో జమున జన్మించారు.. జమున తండ్రి శ్రీనివాసరావు,, తల్లి కౌసల్యాదేవి..సినిమాల్లోకి రాకముందు జమున అసలు పేరు జానాబాయి..హంపిలో జన్మించినా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో అమె బాల్యం గడిచింది..జమున, చిన్నప్పటి నుంచే పాటలు పాడుతూ, నాటకాలు వేస్తూ అందరిలో గుర్తింపు తెచ్చుకుంది..అలా నాటకాలు వేస్తున్న సమయంలో హిరోయిన్ సావిత్రి దుగ్గిరాలలో నాటక ప్రదర్శన ఉన్న సమయంలో జమున ఇంటిలోనే బస చేశారు..సావిత్రి, జమునని సినిమాల్లోకి రమ్మని ప్రోత్సహించడంతో సినిమా రంగంపై ఆశలు పెంచుకుంది..తొలి అవకాశం జై వీర బేతాళ అనే సినిమాలో జమునకు అవకాశం వచ్చినా ఆ సినిమా మధ్యలో ఆగిపోవడంతో నిరాశకి గురైంది..వెంటనే గరికపాటి రాజారావు ‘పుట్టిల్లు’ సినిమాతో మరో అవకాశం వచ్చింది..ఈ సినిమా అంతగా ఆడకపోయినా జమున క్యారెక్టర్ కి మాత్రం పేరొచ్చింది..ఈ సినిమాలో నటించే సమయానికి జమునకి 14 ఏళ్ళ వయస్సు..ఇక అక్కడుంచి జమునకి వరుసగా అవకాశాలు వచ్చాయి..NTR,ANR, కృష్ణ, కృష్ణం రాజు, శోభన్ బాబు, హరనాథ్, జగ్గయ్య.. లాంటి స్టార్ హీరోలందరితో కలిసి నటించారు..మిస్సమ్మ సినిమాలో అమాయకత్వం, అల్లరి పాత్రతో మెప్పించింది..ఆ తర్వాత శ్రీకృష్ణ తులాభారం సినిమాలో మరోసారి సత్యభామ పాత్ర పోషించి ఆ పాత్రకే వన్నె తెచ్చింది..ఆ సినిమాలో ఎన్టీఆర్ కి ధీటుగా సత్యభామ పాత్రలో నటించింది..
తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 190 కి పైగా సినిమాల్లో నటించింది..1965లో జూలూరి రమణారావుతో జమున వివాహం జరిగింది..ప్రస్తుతం బంజారాహిల్స్ లో నివాసం ఉంటున్న జమునకి వంశీ, స్రవంతి ఇద్దరు సంతానం..ప్రస్తుతం జమున కొడుకు వంశీ మీడియా ప్రొఫెసర్ గా శాన్ ఫ్రాన్సిస్కోలో పనిచేస్తున్నారు..కూతురు ఇక్కడే హైదరాబాద్ లో నివసిస్తుండగా జమున ఆవిడ వద్దే ఉంటుంది..జమున మరణంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకి నివాళులు అర్పిస్తున్నారు.