HYDERABAD

హైదరాబాద్ ఓల్డ్ సిటీ రాత్రి 7 గంటలకల్లా షాపులు బంద్-ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్: చాలా సంవత్సరాల తరువాత పాతబస్తీలో పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. ఉద్రిక్త పరిస్థితులను అదుపు చేసేందుకు పోలీసుల బలగాలను భారీ సంఖ్యలో మొహరించారు. రాత్రి 7 గంటలకల్లా వ్యాపారాలు, దుకాణాలన్నీ మూసివేయాలని ఆదేశించారు. పాతబస్తీవైపు వచ్చే వాహనాలన్నీ దారి మళ్లించారు. చార్మినార్, శాలిబండ, మొఘల్ పురాలో దుకాణాలు, హోటళ్లను మూసివేయించారు. ఈస్ట్ జోన్, సౌత్ జోన్ పరిసర ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పాతబస్తీ మొత్తం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దళాలను మొహరించారు. రోడ్లపై నిరసనలు చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. 

పాతబస్తీలో ఆంక్షలు:-ప్రస్తుతం ఉన్న లాండ్ అండ్ ఆర్డర్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని దృష్ట్యా సాధారణ ట్రాఫిక్ అవసరాన్ని బట్టి ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.పరిస్థితులను దృష్టిలో వుంచుకుని,అవసరాన్ని బట్టి ట్రాఫిక్ ఆంక్షలు వుంటాయని,,ప్రజలు సహకరించాలని కోరారు.

మళ్లీంపులు:- పురానాపూల్ బ్రిడ్జి, ఎంజే బ్రిడ్జి, నయాపూల్ బ్రిడ్జి, శివాజీ బ్రిడ్జి, చాద‌ర్‌ఘాట్ బ్రిడ్జి, చాద‌ర్‌ఘాట్ కాజ్‌వే, ముసారాంబాగ్ బ్రిడ్జి నుంచి ఓల్డ్ సిటీ, మ‌ల‌క్‌పేట్‌, ఎల్బీన‌గ‌ర్‌కు వెళ్లే వాహ‌న‌దారులు ప్ర‌త్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాల‌ని పోలీసులు సూచించారు.

ఎంజే మార్కెట్ నుంచి న‌యాపూల్ బ్రిడ్జి, ఎంజే బ్రిడ్జి, పురానాపూల్ బ్రిడ్జి నుంచి ఓల్డ్ సిటీకి వేళ్లే దారుల్లో కూడా పోలీసులు ఆంక్ష‌లు విధించారు. ఈ దారుల్లో వెళ్లే వారు 100 ఫీట్ రోడ్డు, జియ‌గూడ‌, రామ్‌సింగ్‌పురా, అత్తాపూర్, ఆరాంఘ‌ర్, మైలార్‌దేవ్‌ప‌ల్లి, చాంద్రాయ‌ణ‌గుట్ట మీదుగా త‌మ గ‌మ్య‌స్థానాల‌కు చేరుకోవ‌చ్చు.

ఎంజే మార్కెట్ నుంచి న‌యాపూల్ బ్రిడ్జి, శివాజీ బ్రిడ్జి మీదుగా ఓల్డ్ సిటీకి చేరుకునే వారు.. రంగ‌మ‌హ‌ల్‌, చాద‌ర్‌ఘాట్‌, నింబోలిఅడ్డ‌, టూరిస్ట్ జంక్ష‌న్, బ‌ర్క‌త్‌పురా, ఫీవ‌ర్ హాస్పిట‌ల్‌, విద్యాన‌గ‌ర్‌, తార్నాక మీదుగా చేరుకోవాలి.

అబిడ్స్, కోఠి నుంచి ఎల్బీన‌గ‌ర్‌, మ‌ల‌క్‌పేట్‌, దిల్‌సుఖ్‌న‌గ‌ర్ వెళ్లే వాహ‌న‌దారులు.. నింబోలిఅడ్డ‌, టూరిస్ట్ జంక్ష‌న్, బ‌ర్క‌త్‌పురా, ఫీవ‌ర్ హాస్పిట‌ల్‌, విద్యాన‌గ‌ర్‌, తార్నాక లేదా 6 నంబ‌ర్, రామంతాపూర్ మీదుగా చేరుకోవాలి.

ఓల్డ్ సిటీ నుంచి అబిడ్స్, కోఠి, ఎంజే మార్కెట్‌, ల‌క్డీకాపూల్ వైపు వెళ్లే వారు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఎంచుకోవాల‌ని సూచించారు. చాంద్రాయ‌ణగుట్ట‌, మైలార్‌దేవ్‌ప‌ల్లి, ఆరాంఘ‌ర్, అత్తాపూర్, మెహిదీప‌ట్నం, మాసాబ్‌ట్యాంక్‌, ల‌క్డీకాపూల్ చేరుకోవ‌చ్చు.

దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌, ఎల్బీన‌గ‌ర్ నుంచి అబిడ్స్, కోఠి, ఎంజే మార్కెట్ వెళ్లే వాహ‌న‌దారులు.. ఉప్ప‌ల్, తార్నాక‌, విద్యాన‌గ‌ర్, ఫీవ‌ర్ హాస్పిట‌ల్‌, బ‌ర్క‌త్‌పురా మీదుగా ప్ర‌యాణించొచ్చు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *