తీరం దాటినప్పటికి బీభత్సం సృష్టిస్తున్న మండూస్ తుపాన్

అమరావతి: మాండూస్ తుపాను ప్రభావంతో తిరుమలలో భారీ వర్షం కురుస్తు వుండడంతో ఆప్రమత్తమైన అధికారులు, ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాల రాకపోకలను నిలిపివేశారు. పాపవినాశనం, శిలాతోరణం మార్గాలను మూసివేసిన టీటీడీ అధికారులు క్రేన్స్, ఆటోక్లీనిక్ వాహనాలను సిద్ధం చేసింది. భారీ వర్షాల కారణంగా తిరుపతి జిల్లాలోని డ్యామ్‌లు అన్నీ నిండుకుండల్లా మారాయి.
తమిళనాడులో మాండూస్ తుపాను తీరం దాటినప్పటికి బీభత్సం సృష్టిస్తోంది. చెన్నైనగరంతో పాటు పది జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. కాశిమేడు దగ్గర భీకర అలల ఉధృతికి మత్స్యకారుల బోట్లు ధ్వంసం అయ్యాయి. పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు కుప్పకూలడంతో పాటు పలు ప్రాంతాల్లో గోడలు కూలి వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఇప్పటి వరకు తుపాను కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. చెన్నై విమానాశ్రయం నుంచి అన్ని విమానాలను రద్దు చేశారు. మరోవైపు అధికారులు, సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు.