AMARAVATHISPORTS

రెజర్లలో కొంత మంది కాంగ్రెస్ తోలుబొమ్మలా మారారు- బబితా ఫోగట్

అమరావతి: రెజ్లర్లు సాక్షి మాలిక్, సత్యవర్త్ కడియాన్ పై,రెజ్లర్ బబితా ఫొగట్ ఆగ్రహం వ్యక్తం చేసింది..సాక్షి మాలిక్, బబితా ఫొగట్ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది..రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా రెజ్లర్లు చేసిన పోరాటంలో బబితా ఫొగట్ కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలబడ్డారని సాక్షి మాలిక్ ఆరోపించింది..ఇందుకు బబితా ఫోగట్ స్పందిస్తూ సాక్షి మాలిక్,, కాంగ్రెస్ తోలుబొమ్మలా మారిందని మండిపడింది….రెజర్ల అందోళనలో రైతు సంఘం నాయకుడు అయిన రాకేష్ తికాయత్ జోక్యం చేసుకోవాల్సి అవసంర ఏం వచ్చిందని ప్రశ్నించింది..శనివారం సాక్షి మాలిక్,, సత్యవర్త్ కడియాన్ సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశారు.. అందులో వారు మాట్లాడుతూ… రెజ్లర్ల ఆందోళన వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందని కొందరు అంటున్నారని,,అందులో నిజం లేదని తెలిపారు..సాక్షి మాలిక్ చేసిన వ్యాఖ్యలపై బబితా మండిపడుతూ,,రెజ్లర్ల ఆందోళనతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని చెప్పింది.. రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసే విషయంలో తాను మొదటి నుంచీ వ్యతిరేకంగానే ఉన్నానని తెలిపింది..

” నా సోదరి, ఆమె భర్త పోస్ట్ చేసిన వీడియో చూసి చాలా బాధపడ్డాను..జనవరిలో జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు అనుమతి కోరుతూ పోలీసులకు రాసిన లేఖపై నా సంతకం లేదని,,ఈ విషయంలో నాకే సంబంధమూ లేదు ” అని బబితా ఫొగట్ తెలిపింది..తనకు ప్రధాని మోదీపై,, న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని,, నిజాలు బయటకు వస్తాయని పేర్కొంది..తాను ప్రధాని మోదీని, అమిత్ షాను కలవాలని తాను రెజ్లర్లకు చెబితే, వారు వెళ్లి దీపేందర్ సింగ్ హుడా, ప్రియాంకా గాంధీలాంటి వారిని కలిశారని పేర్కొంది..ఆందోళన జరిగిన తీరును చూస్తుంటే రెజ్లర్లు కాంగ్రెస్ తోలుబొమ్మలుగా మారారని దేశ ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పింది..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *