400 సంవత్సరాల చరిత్ర ఉన్న శ్రీ వైద్య వీర రాఘవస్వామి ఆలయం నెల్లూరులో

నెల్లూరు: నెల్లూరు నగరంలోని వేమాలశెట్టి బావి తిరునాళ్లు ఘనంగా జరిగాయి..దుర్గమిట్ట ప్రాంతంలోని శ్రీ వైద్య వీర రాఘవస్వామి ఆలయంలో ఏట సంక్రాంతి తర్వాత వచ్చే అమావాస్య నాడు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు..దాదాపు 400 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తే ఆరోగ్యం బాగుపడుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.. వైద్య వీరరాఘవ స్వామిని దర్శించుకున్న భక్తులు ఇక్కడ పీఠంపై ఉప్పు,మిరియాలు చల్లి,, వేమాలశెట్టి బావిలో బెల్లం వేస్తారు..ఇక్కడి బావిలో బెల్లం వేయడం వల్ల తమ ఆనారోగ్యాలు దురమై,,ఆరోగ్యం మెరుగుపడిందని విశ్వసిస్తారు..వేమాలశెట్టి బావి తిరునాళ్లకు రాష్ట్ర,,జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి శనివారం పూజలు నిర్వహించారు..