వందేభారత్ ఎక్స్ ప్రెస్‌పై మరోసారి రాళ్ల దాడి

అమరావతి: వందేభారత్ ఎక్స్ ప్రెస్‌పై బీహార్ లోని కతిహార్ జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు దాడి చేశారు..ఈ దాడిలో రైలు అద్దం పలిగింది..ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు.. న్యూ జల్పాయ్‌గురి నుంచి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరిన వందే భారత్ రైలుపై సాయంత్రం 4.25 గంటల సమయంలో డకోలా-టెల్టా స్టేషన్ల మధ్య ఈ రాళ్లదాడి సంఘటన చోటు చేసుకుంది..రాయి తగలడంతో C6 కోచ్‌లోని ఓ అద్దం పగిలింది.. దాడి సంఘటనపై కేసు నమోదు చేసుకున్న డకోలా రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు..డిసెంబర్ 30వ తేదిన ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు.