AMARAVATHIDEVOTIONAL

ఈ సంవత్సరం రెండుసార్లు శ్రీవారి బ్రహ్మోత్సవాలు-ఈవో ధర్మారెడ్డి

తిరుమల: ఈ సంవత్సరం ఏడుకొండలవాడి బ్రహ్మోత్సవాలు రెండుసార్లు నిర్వహించేలా టీటీడీ అధికార యంత్రాగం కీలక నిర్ణయం తీసుకుంది..సోమవారం ఈ మేరకు శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తిరుమల అన్నమయ్య భవన్ లో అధికార యంత్రాంగంతో టీటీడీ ఈవో ధర్మారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు..అధికమాసంతో వార్షిక,, నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నా యన్నారు..సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు..అలాగే అక్టోబర్ 14 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఉంటాయని తెలిపారు. సెప్టెంబర్ 18న ధ్వజారోహణం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఈఓ ధర్మారెడ్డి వెల్లడించారు..22న గరుడసేవ, 23న స్వర్ణ రథం, 26న చక్రస్నానంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నారు..

300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం:- బ్రహ్మోత్సవాల సందర్భంగా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, టోకెన్ల అదనపు కోటా విడుదల చేస్తామని పేర్కొన్నారు..బ్రహ్మోత్సవాల్లో రోజుకు 10వేల మంది వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు దర్శనం భాగ్యం కల్పిస్తామని,, భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సదుపాయాలు అందజేస్తామన్నారు.. రెండు సార్లు జరిగే బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని,, వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు..స్వయంగా వచ్చే వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పిస్తామన్నారు..అలాగే గరుడ సేవకు వచ్చే ప్రతి భక్తుడికి వాహన సేవను తిలకించేలా చేయడమే లక్ష్యమన్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *