AMARAVATHINATIONAL

భద్రత దళాల ఆలర్డ్ కావడంతో జమ్మూకశ్మీర్ హైవేపై తప్పిన భారీ ముప్పు

అమరావతి: జమ్మూకశ్మీర్ లో భద్రతా దళాలు టార్గెట్ గా ఉగ్రవాదులు అమర్చిన పేలుడు పదార్థాలను బాంబు డిస్పోజల్ స్వ్కాడ్ నిర్వీర్యం చేయడంతో పెను విధ్వసం తప్పింది..అడ్వన్డ్స్ రోడ్ సేప్టిచెకింగ్ టీమ్ శ్రీనగర్-బారాముల్లా జాతీయ రహదారిపై జంగం ప్లైవర్ వద్ద సోమవారం ఉదయం రొటిన్ చెకింగ్ లో భాగంగా ఈ ప్రాంతంకు వెళ్లారు..ఫ్లైఓవర్ బ్రిడ్జి క్రింద ఒక బ్యాగ్ ను గుర్తించారు.. వెంటనే బాంబ్ డిస్పోజిబుల్ స్వ్కాడ్ బృందాలకు సమాచారం అందించారు.. వారు హుటాహుటీన ఘటన స్థలికి చేరుకొని బాంబును నిర్వీర్యం చేశారు..దీంతో పెద్ద ప్రమాదం తప్పిపొయింది.. ఒకవేళ ఈ పేలుడు గనుక సంభవించి వున్నట్లయితే భారీ నష్టం జరిగివుండేదే..పేలుడు పదార్థాలను ముందుగానే గుర్తించడంతో భద్రతా దళాలు ఆ మార్గంలో ట్రాఫిక్ ను పూర్తిగా నిలిపివేశారు..ఈ మార్గంలో భద్రతా దళాల కాన్వాయ్ లు వేకువజామున సమయంలో ప్రయాణిస్తుంటాయి..ఈ నేపథ్యంలో వాటిని లక్ష్యంగా చేసుకొని పేలుడు పదార్థాలను పెట్టినట్లు అధికారులు అంచన వేస్తుస్తున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *