AMARAVATHITECHNOLOGY

భారత రక్షణ శాఖ అమ్ముల పొదిలో మరో “ప్రళయ్”

అమరావతి: భారత రక్షణ శాఖ అమ్ముల పొదిలో మరో “ప్రళయ్”..భూ ఉపరితలం నుంచి భూ ఉపరితలంపై ప్రయోగించే షార్ట్ రేంజ్ బాలిస్టిక్ “ప్రళయ్” క్షిపణిని DRDA మంగళవారంనాడు విజయవంతంగా ప్రయోగించింది.. ఒడిశా తీరప్రాతంలోని అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ఉదయం 9.50 గంటలకు ప్రళయ్ క్షిపణిని పరీక్షించినట్టు రక్షణశాఖ అధికారులు వెల్లడించారు..దేశ రక్షణావసరాలు, సరిహద్దుల్లో పటిష్ట భద్రత కోసం DRDA ఈ క్షిపణని అభివృద్ధి చేసింది.. “ప్రళయ్” 350 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదిస్తుంది..500 నుంచి 1000 కిలోల పేలోడ్‌ను మోసుకుని వెళ్తుంది.. ప్రళయ్ క్షిపణిని చైనా ‘డాంగ్ ఫెంగ్ 12’, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ఉపయోగించిన Iskanderతో ఫలితాలను ఇస్తుందని రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *