AGRICULTURENATIONAL

ఢిల్లీలో వాయుకాలుష్యంకు కారణమైన గడ్డిని కాల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం

అమరావతి: దేశ రాజధాని న్యూఢిల్లీలో వాయుకాలుష్యంకు కారణమైన పంట వ్యర్థాల కాల్చివేతపై సుప్రీమ్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది..పంట వ్యర్థాలను తగులబెట్టడం అంటే హత్యతో సమానం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.. ఢిల్లీలో వాయుకాలుష్యంపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ధర్మాసనం పై విధంగా స్పందించింది.. పంజాబ్ ప్రభుత్వానికి చీవాట్లు పెడుతూ పంట వ్యర్థాలను తగులబెడుతున్న ఘటనలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆపలేకపోతోందని ప్రశ్నించింది.. ఇది ప్రజల జీవితాలకు సంబంధించిన సమస్య…పరస్పర రాజకీయ విమర్శలు,, నిందారోపణలు మాని పరిష్కారంపై దృష్టి పెట్టాలి అంటూ హితవు పలికింది..“బలవంతపు చర్యలు చేపడతారో లేక ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా ప్రత్యామ్నాయ పద్ధతులు అమలు చేస్తారో మాకు తెలియదు,, తక్షణమే ఈ చర్యలకు అడ్డుకట్ట వేయాలి” అంటూ ఆదేశాలు జారీ చేసింది.
వరి గడ్డిని కాల్చడం:- పంజాబ్ లో యంత్రపరికరాల వినియోగం ఎక్కువ. పంట చేతికి వచ్చిన తరువాత యంత్రాల ద్వారానే కోతలు పూర్తి చేస్తారు..యంత్రాల ద్వారా జరిగే వరికోతలో భూమి నుంచి కనీసం మోకాలు ఎత్తు వరకు గడ్డి మిగిలిపోతుంది.. వాటిని తగులబెట్టడం ద్వారా రైతులు, రబీ పంటల సాగు కోసం భూమిని దున్నతారు..ఈ పంట కోత తరువత గడ్డిని కాల్చడంతో,,గడ్డిని నుంచి వచ్చే పొగ, ఢిల్లీలో వాయుకాలుష్యానికి ప్రధాన కారణంగా మారుతోంది..ఇదే సమయంలో ఖరీఫ్ పంట చేతికొచ్చే సమయానికి శీతాకాలం ప్రారంభమై పొగమంచు ఏర్పడుతుంది.. ఇది కాలుష్య కారకాలను భూ ఉపరితల వాతావరణంలోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. దాంతో వాయుకాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిని దాటి ప్రాణాంతకంగా మారుతోంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *