అమరావతి ప్రాంతం అభివృద్ది కేసులో పాక్షిక్ష స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు

అమరావతి: అమరావతి ప్రాంతం అభివృద్ది కేసుపై సుప్రీం కోర్టులో సోమవారం న్యాయమూర్తులు కేఎం జోసెఫ్, బీవీ నాగరత్నల ధర్మాసనం ముందు విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున మాజీ అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ వాదనలు వినిపించారు.గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని సుప్రీంలో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే.అమరావతిపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు అయ్యేలా చూడాలని రైతులు కోరారు. హైకోర్టు తీర్పుపై పూర్తి స్థాయి స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు తీర్పులోని కొన్ని అంశాలపై మాత్రమే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. రాజధానిలో నిర్మాణాలపై హైకోర్టు విధించిన కాలపరిమితికి సంబంధించి మాత్రమే సుప్రీం స్టే విధించింది. రాజధానిపై అసెంబ్లీకి చట్టం చేసే అధికారం లేదని హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించడానికి సుప్రీం నిరాకరిస్తూ, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 31వ తేదీకి వాయిదా వేసింది.