AMARAVATHIPOLITICS

రాష్ట్రంలో ల్యాండ్, లిక్కర్ స్కామ్ లు నడుస్తున్నాయి-జె.పి నడ్డా

అభివృద్ధి నిలిచిపోయింది..
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని,,ఇందుకు ఉదహరణగా రాష్ట్రంలో ల్యాండ్, లిక్కర్ స్కామ్ లు నడుస్తున్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా తీవ్ర విమర్శలు చేశారు..శనివారం శ్రీకాళహస్తిలో బీజేపీ సంపర్క్ అభియాన్ సభలో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి శంకుస్థాపన చేస్తే,,ప్రభుత్వం మారిన తరువాత అభివృద్ది అనేది కన్పించలేదన్నారు..రాష్ర్టంలో అరాచకం రాజ్యమేలుతోందని,,,చట్టంను అమలు చేయాల్సి పోలీస్ వ్యవస్ధ పనిచేయడం లేదని దుయ్యబట్టారు..వైసీపీ డబ్బు సంపాదనలో బిజీగా ఉందని,,ఇలాంటి పార్టీని గద్దె దింపాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు.. రాయలసీమను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు.. ఒక్క ఛాన్స్ బీజేపీకి ఇస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని నడ్డా స్పష్టం చేశారు..
“దేశ అభివృద్ధే అజెండాగా ప్రధాని మోదీ 9 ఏళ్ల పాలన కొనసాగిందని,,ఓటు బ్యాంకు రాజకీయాలతో అభివృద్ధి సాధ్యం “కాదన్నారు.. ప్రధాని ఎప్పుడూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయరని,,గత ప్రభుత్వాలు అనుసరించిన ఓటు బ్యాంకు రాజకీయాల దిశను మార్చి దేశమంతటా అభివృద్ధి జరగేలా విధాన పరమైన చర్యలు తీసుకున్నరని చెప్పారు..పేదలు, ఎస్సీలు, రైతుల సంక్షేమం కోసం కేంద్రం కృషి చేస్తోందన్నారు..మోదీ ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టే నాటికి విద్యుత్ లేని గ్రామాలు 19 వేలు ఉండేవని,,నేడు దేశంలో విద్యుత్ సౌకర్యం లేని గ్రామమే కనిపించదన్నారు..దేశంలో 50 కోట్ల మందికి రూ.5 లక్షలు చొప్పున బీమా సౌకర్యం కల్పించిందని,,ప్రజల చికిత్సల కోసం మోదీ ప్రభుత్వం రూ.80 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *