విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్స్ లో కేంద్రం నిధులు వున్నాయి-సోము.వీర్రాజు

అమరావతి: ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తన పుట్టిన రోజు సందర్భంగా విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్స్ (Tabs) కేంద్ర ప్రభుత్వ సమగ్ర శిక్షా అభయాన్‌లో భాగమేనని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘నాడు, నేడు’ నిధుల్లో కూడా కేంద్రం వాటా ఉందన్నారు..రాష్ట్రంలో 9000 కోట్లతో అనంతపురం – గుంటూరు హైవేకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు..మాది అభివృద్ధి మంత్రం…కుటుంబ పార్టీలది రాజకీయ కుతంత్రం…ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి బీజెపీ-జనసేనలతో మాత్రమే ప్రత్యమ్నాయం అన్నారు..రాష్ట్రంలో పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న తీరు మారాలన్నారు. ఏపీలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వాళ్ళను పోలీసులతో ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు.