రెండు సందర్బల్లో భారత్ ప్రధాని చేసిన సాయం మర్చిపోలేనిది-ప్రధాని షేక్ హసీనా

అమరావతి: కరోనా-19 సమయంలో,,రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న ప్రస్తుత సమయంలో భారత్ తమకు అందించిన సాయం మర్చిపోలేనిదని, తమకు సహకారం అందించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి,బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కృతజ్ఞతలు తెలిపారు..సెప్టెంబర్ 5వ తేది నుంచి 8వ తేదీ వరకు భారత్ లో షేక్ హసీనా పర్యటించనున్నారు. ఆదివారం ఆమె ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమం కింద పొరుగు దేశాలకు కోవిడ్-19 వ్యాక్సిన్ లను అందించిన నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ క్రమంలో భారతదేశాన్ని ఆమె ‘ విశ్వసనీయ స్నేహితుడు’ అని పేర్కొన్నారు.అదేవిధంగా రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం సమయంలో మా విద్యార్థులు చాలా మంది ఉక్రెయిన్ లో చిక్కుకుపోయారని,ఇదే సమయంలో పోలాండ్ నుంచి భారతీయ విద్యార్థులను తరలించినప్పుడు, మా విద్యార్థులను కూడా ఇంటికి తిరిగి వచ్చేందుకు భారత్ చేసిన సాయం మరువలేనిదని,,ఈ చొరవకు నేను ప్రధానమంత్రి మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని హసీనా అన్నారు. తమ దేశ పౌరులు ఎదుర్కొంటున్న సమస్యలను తగ్గించడానికి ఇరు దేశాల మధ్య చిరకాల నీటి భాగస్వామ్యం వివాదాన్ని పరిష్కరించాలని అన్నారు. మేము దిగువన ఉన్నాము. భారతదేశం నుండి నీరు వస్తోంది. కాబట్టి, భారతదేశం మరింత ఉదారతను ప్రదర్శించాలని కోరారు..ముఖ్యంగా తీస్తా నది…ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీనిని పరిష్కరించడానికి ఆసక్తిగా ఉన్నారని తెలిసింది..ఇది చాలా కాలంగా ఉన్న సమస్య,,దిన్ని పరిష్కరించే దిశగా చర్చలు జరగాల్సిన వుందని అభిప్రాయం వ్యక్తం చేశారు..ఆమె చివరిసారిగా 2019లో అక్టోబర్ లో కరోనా వైరస్ కంటే ముందు భారతదేశాన్ని సందర్శించారు. మళ్లీ రేపటి నుంచి మూడు రోజుల పాటు భారత్ పర్యటనకు రానున్నారు..ఈ సందర్బంలో ప్రధాని హసీనా, కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపాధ్యక్షుడు జగదీప్ ధంకర్ లతో సమావేశమవుతారు.అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యి ద్వైపాక్షిక సంప్రదిపులు జరపనున్నారు.
#WATCH | Bangladesh PM Sheikh Hasina thanks PM Modi for India’s Vaccine Maitri program, terms evacuation of Bangladesh nationals from war-torn Ukraine by India as a ”friendly gesture” pic.twitter.com/1I7ZxlYL3z
— ANI (@ANI) September 4, 2022