AMARAVATHICRIMEINTERNATIONAL

అగిన 8 మంది భారత మాజీ నావికాదళ సిబ్బంది మరణశిక్ష-కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి

అప్పీల్ చేసుకునేందుకు అమోదించిన ఖతార్ కోర్టు..
అమరావతి: ఖతార్ లో గూఢాచర్యం కేసులో అరెస్ట్ కాబడి,,మరణశిక్ష పడిన 8 మంది భారత మాజీ నావికాదళ సిబ్బంది విషయంలో మరణశిక్షపై సమీక్ష చేయాలని భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని ఖతార్ కోర్టు అంగీకరించింది.. అప్పీల్ ను పరిశీలించిన తరువాతే ఖతార్ కోర్టు, విచారణ తేదీని నిర్ణయిస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.. గూఢాచర్యం ఆరోపణల కేసులో అక్టోబర్ 26వ తేదిన 8 మంది భారత మాజీ నావికాదళ సిబ్బందికి ఖతార్ కోర్టు మరణశిక్ష విధించింది..
2022 ఆగస్టులో గూఢాచర్యం కేసులో భారత్ కు చెందిన 8 మంది మాజీ నావికాదళ సిబ్బందిని ఖతార్ గూఢచార సంస్థ అరెస్టు చేసింది..అయితే వారిపై ఉన్న ఆరోపణలను ఖతార్ అధికారులు ఇప్పటి వరకు బహిర్గతం చేయలేదు.. వారి బెయిల్ పిటిషన్లను చాలాసార్లు తిరస్కరిస్తూ చివరికి ఖతార్ లోని ఫస్ట్ ఇన్ స్టాన్స్ కోర్టు తీర్పు వెలువరించింది..
భారత్ అధికారుల కృషితో, వారికి కాన్సులర్ యాక్సెస్ మంజూరు చేశారు..వారిని విడుదల చేయించడానికి భారత అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.. అరెస్ట్ అయిన భారత నావికాదళ వెటరన్లు కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల…కమాండర్ అమిత్ నాగ్ పాల్,, కమాండర్ సంజీవ్ గుప్తా… కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్,, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ,, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్… సెయిలర్ రాగేష్ గోపకుమార్ ఉన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *