7వ సారి మహిళల క్రికెట్ ఆసియా కప్ కైవసం చేసుకున్న భారత జట్టు

అమరావతి: 7వ సారి కూడా మహిళల క్రికెట్ ఆసియా కప్ Twenty20ను భారత జట్టు కైవసం చేసుకుంది. శనివారం సిల్‌హట్‌లో శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.66 పరుగుల లక్ష్యాన్ని 8.3 ఓవర్లలోనే ఆలవొకగా చేధించింది.తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకను, భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ తో కట్టడి చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో శ్రీలంక 9 వికెట్లు కోల్పోయి, 65 పరుగులు సాధించింది. శ్రీలంక తరఫున ఇనోకా రణవీర అత్యధికంగా 18 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో రేణకా సింగ్ 3 వికెట్లు,,రాజేశ్వరి గైక్వాడ్,, స్నేహ్ రాణా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 66 పరుగుల స్వల్ప లక్ష్యంను చేధించేందుకు బరిలోకి దిగిన, భారత్ 8.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి, 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్ లో భారత్ స్టార్ క్రీడాకారిణి స్మృతి మంధాన అద్భుతంగా బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ సాధించింది. స్మృతి మంధాన 25 బంతుల్లోనే 50 పరుగులు సాధించింది. ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడుతూ 51 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. భారత బ్యాటింగ్‌లో షెఫాలీ వర్మ (5), జెమీమీ రోడ్రిగెజ్ (2) పరుగులు సాధించి ఔటయ్యారు.ఈ సమయంలో బరిలోకి దిగిన హర్మన్ ప్రీత్,,స్మృతి మంధానకు అండగా నిలిచింది.హర్మన్ ఈ మ్యాచ్ లో 11 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలవడంతో భారత మహిళల జట్టు ఆసియా కప్ కైవసం చేసుకుంది.