x
Close
NATIONAL

వరద ఉదృతిని తట్టుకోలేక కూలిపోయిన కంగ్రా బ్రిడ్జి

వరద ఉదృతిని తట్టుకోలేక కూలిపోయిన కంగ్రా బ్రిడ్జి
  • PublishedAugust 20, 2022

అమరావతి: ప్రకృతి ప్రకోపంతో కురుస్తున్న వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌,,హిమాచల్‌ ప్రదేశ్‌ లు చిగురటాకుల వణికిపోతున్నాయి..ఆకస్మిక వరదలతో రెండు రాష్ట్రాల్లోనూ భారీగా ఆస్తి,,ప్రాణ నష్టం సంభవించిన్నట్లు సమాచారం..రాబోయే 5 రోజుల పాటు ఇదే పరిస్థితి నెలకొనవచ్చనే వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజల్లో తీవ్రభయాందోళనలు నెలకొన్నాయి..పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దు జిల్లా అయి కంగ్రాలోని, చక్కీ నదిపై ఉన్న 800 మీటర్ల రైల్వే వంతెన శనివారం ఆకస్మిక వరదల కారణంగా కొంత మేర కూలి నదిలో కొట్టుకుని పొయింది..దీంతో బ్రిడ్జి కొట్టుకు పొయిన పిల్లర్‌ను తిరిగి నిర్మించేంత వరకు పఠాన్‌కోట్‌, జోగిందర్‌ నగర్‌ మధ్య రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు..ఈ వంతెన 1928లో బ్రిటిషర్లు నిర్మించినట్లు స్థానికులు పేర్కొంటారు..ప్రస్తుతం రోడ్లు, బస్సు మార్గాలు అందుబాటులో లేకపోవడంతో పాంగ్‌ డ్యామ్‌ వన్యప్రాణుల అభయారణ్యంలో ఉన్న వందలాది గ్రామాలకు ఈ రైలు మార్గంమే ఆధారం..నదీ గర్భంలో అక్రమ మైనింగ్‌ సంపదను తరలించేందుకు 90 ఏళ్ల నాటి వంతెనను విచ్చలవిడిగా ఉపయోగించారు..దింతో వంతెన పిల్లర్లు బలహీనపడాయి..ఈ విషయంపై స్థానికులు పలు సార్లు ఫిర్యాదులు చేసినప్పటికి,,అధికారులు,నాయకులు పట్టించుకోలేదు..గతంలో ఓ పిల్లర్‌కు పగుళ్లు రావడంతో రైలు సేవలను నిలిపివేయగా,,నేడు ఏకంగా స్థంభమే కొట్టుకుపోయింది..ఇదే సమయంలో ధర్మశాలలోనూ కొండ చరియలు విరిగిపడ్డాయి..హిమాచల్‌ ప్రదేశ్‌లో జరిగిన వేరు వేరు సంఘటనల్లో ఆరుగురు మరణించగా,,మరో సంఘటనలో 13 మృతి చెందివుంటారని అధికారులు ప్రకటించారు.. ఈ ఘటనలపై ముఖ్యమంత్రి జై రామ్‌ థాకూర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు..బాధితులు అన్ని విధాలు అదుకునేందుకు తక్షణమే ఏర్పాట్లు చేయాలని అధికారులను అదేశించారు.. 

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.