AMARAVATHINATIONALTECHNOLOGY

అంతరిక్ష ప్రయాణలను సులభతరం చేసే పుష్పక్‌ విమాన్‌ ప్రయోగం విజయవంతం

అమరావతి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) రోదసి ప్రయాణాలు సులభతరం చేసేందుకు చేపట్టిన కీలకమైన ప్రయోగంలో ఘన విజయవంతం అయింది..దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్న భారతదేశపు మొట్టమొదటి పునర్వినియోగ లాంచ్ వెహికల్ “పుష్పక్‌ విమాన్‌”ను ఇస్రో శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది..Reusable Rocket “పుష్పక్‌ విమాన్‌”ను కర్ణాటకలోని రక్షణశాఖకు చెందిన ‘చాలకెరె రన్‌వే’ నుంచి ఉదయం 7 గంటలకు ఈ ప్రయోగాన్ని చేపట్టింది..ప్రయోగంలో భాగంగా పుష్పక్ తనంతట తానుగా రన్‌వే‌పై ల్యాండ్ కావడంతో ఒక మైలురాయివంటిది..అత్యంత సంక్లిష్టమైన ‘రొబోటిక్‌ ల్యాండింగ్’ సామర్థ్యాన్ని సాధించేందుకు ఈ ప్రయోగం చేపట్టడడం జరిగిందని,,ఈ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో వెల్లడించింది.. reusable launch vehicle (RLV) ప్రయోగాల్లో ఇస్రోకు ఇది 3వ ప్రయోగం..6.5 మీటర్ల పొడవు,, 1.75 టన్నుల బరువుండే ‘pushpak’ను ఆకాశంలో 4.5 k.m ఎత్తు నుంచి చూనాక్ హెలికాప్టర్‌ నుంచి భూమిపై నిర్దేశిత లక్ష్యం వైపు ప్రయోగిస్తారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *