AMARAVATHIINTERNATIONAL

ర‌ష్యాలో ప్రారంభంమైన దేశాధ్య‌క్ష ఎన్నిక‌లు

అమరావతి: ర‌ష్యాలో దేశాధ్య‌క్ష ఎన్నిక‌లు స్థానిక కాల‌మానం ప్ర‌కారం ఉద‌యం 8 గంట‌ల‌కు దేశ‌వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో..నేటి నుంచి 3 రోజుల పాటు అంటే ఆదివారం వ‌ర‌కు ర‌ష్యా అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి..అధ్య‌క్ష హోదా కోసం వ్లాదిమిర్ పుతిన్ తో పాటు నాలుగురు పోటీప‌డుతున్నారు.. అధ్యక్షడిగా ఎన్నికైన వ్యక్తి 6 సంవత్సరాల పాటు ప్ర‌భుత్వ పాల‌న సాగిస్తారు..పుతిన్ ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్నారు.. లిబ‌ర‌ల్ డెమోక్ర‌టిక్ పార్టీ నేత లియోనిడ్ స్ల‌ట్‌స్కీ,, క‌మ్యూనిస్టు నేత నికోలే క‌రిటొనోవ్‌,, లిబ‌ర‌ల్ సెంట్రిస్టు వాదిస్లావ్ ద‌వ‌న‌కోవ్ పోటీలో ఉన్నారు..2020లో రాజ్యాంగ సంస్క‌ర‌ణ త‌రువాత ర‌ష్యాలో జ‌రుగుతున్న తొలి దేశాధ్య‌క్ష ఎన్నిక‌లు ఇవి..6 సంవత్సరాల పద‌వీ కాలంతో జ‌రిగే ఈ ఎన్నిక‌ల్లో ఓ అభ్య‌ర్థి రెండు సార్లు దేశాధ్య‌క్ష ప‌ద‌విని చేప‌ట్ట‌వ‌చ్చు అన్న మార్పుల‌తో రాజ్యాంగాన్ని సంస్క‌రించారు..కొంత మంది ఓట‌ర్లు ఆన్‌లైన్ ద్వారా త‌మ బ్యాలెట్ల‌ను వాడుకున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *