AMARAVATHIPOLITICS

తమిళనాడు వారసత్వాన్ని గౌరవించేందుకే ‘సెంగోల్’ను పార్లమెంట్ లో ప్రతిష్టించాం-ప్రధాని మోదీ

తమిళనాడులో అన్నామలై చేపట్టిన ఎన్ మణ్,,ఎన్ మక్కల్ యాత్ర,,తమిళ రాష్ట్ర రాజకీయాలో ఒక కొత్త ఒరవ వడి సృష్టించే ఆవకాశలు ప్రస్పుటంగా కన్పిస్తున్నాయి.. DMK నాయకులు ఆహకార పూరితంగా సనాతన ధర్మంపై చేసిన అయాచిత వ్యాఖ్యలు తమిళ ప్రజల గుండెల్లో చాలా లొతైన గాయం చేసినట్లు స్పష్టంమౌవుతొంది..త్వరలో జరిగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల మనోభావలు ప్రతిబింబవచ్చు….

అమరావతి: కేరళ, తమిళనాడులో రెండు రోజుల పర్యటనలో భాగంగా తమిళనాడులోని తిరుపూరు జిల్లాలో బీజెపీ తమిళనాడు అధ్యక్షడు అన్నామలై చేపట్టిన ఎన్ మణ్,,ఎన్ మక్కల్ యాత్ర ముగింపు సందర్బంగా జరిగిన  ర్యాలీ,, బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, దేశ భవిష్యత్తు రూపకల్పనలో తమిళనాడు కీలక పాత్ర పోషిస్తోందన్నారు..తమిళనాడు రాజకీయాల్లో MGR ఎన్నడూ బంధుప్రీతికి కాకుండా ప్రతిభ వున్నవారికే ఆవకాశలు కల్పించారున్నారు..శ్రీలంక పర్యటనలో ఉన్నప్పుడు MGR జన్మస్థలమైన కాండీలో పర్యటించే అవకాశం నాకు వచ్చిందన్నారు..నేడు ఆయన ‘కర్మభూమి’ తమిళనాడులో తాను ఉన్నాను అని,, కుటుంబ పాలనకు చెల్లుచీటీ చెప్పి సుపరిపాలనను ప్రారంభించిన ఘనత ‘MGRదే అన్నారు..నాణ్యమైన విద్య, హెల్త్ కేర్ అందించేందుకు ఆయన ఎంతో కష్టపడ్డారని,,ఆ కారణంగానే ఆయన అంటే మహిళలకు ఎంతో గౌరవం” అని అన్నారు.. MGRను అవమానించే విధంగా తమిళనాడులో DMK పనిచేస్తోందని విమర్శించారు.. MGR తరువాత తమిళనాడు అభివృద్ధి, అభ్యుదయానికి పాటు పడిన నేత అమ్మ జయలలితేనని అన్నారు..తమిళనాడుతో తనకు భావోద్వేగంతో కూడిన బంధం ఉందని, దేశ, తమిళనాడు సమున్నత వారసత్వాన్ని గౌరవించేందుకే రాష్ట్రం నుంచి పార్లమెంటులో ‘సెంగోల్’ను ప్రతిష్టించామని, నాటి నుంచి యావద్దేశం తమిళనాడు వైపు ఆసక్తితో చూస్తోందన్నారు.. తన వరకు తమిళ భాష, సంస్కృతికి ఒక ప్రత్యేకత ఉందని అందుకనే ఐక్యరాజ్యసమితిలో తాను తమిళ కవిత చదవడంపై ప్రపంచమంతా మాట్లాడుకున్నారని వెల్లడించారు.. 32 సంవత్సరా క్రిందట 1991లో కన్యాకుమారి నుంచి తాను ఏక్తా యాత్ర ప్రారంభించిన విషయాన్ని మోదీ గుర్తు చేసుకున్నారు..రెండు లక్ష్యాలతో ఈ యాత్ర చేపట్టామని అందులో  శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‍‌లో త్రివర్ణపతాకం ఎగురవేయడం,, 370వ అధికరణ రద్దు చేయడం ఆ రెండు ప్రధాన లక్ష్యాలని, ఆ రెండు లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు.. ఇప్పుడు ”ఎన్ మాన్ ఎన్ మక్కల్” పాదయాత్ర తమిళనాడును కొత్తమార్గం వైపు నడిపిస్తుందని చెప్పారు..తమిళనాడు ప్రజలకు నిరంతర సేవలందించేందుకు బీజెపీ కార్యకర్తలు కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు..ప్రజలకు ఉజ్వల భవిష్యత్తుకు మోదీ గ్యారెంటీ అని, మోదీ ఎప్పుడూ ప్రజలవెంటే ఉంటారనే విషయం గుర్తుంచుకోవాలని అన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *