AMARAVATHITECHNOLOGY

TV D1 ఫ్లయిట్ టెస్ట్ విజయవంతం-బంగాళాఖాతంలో సురక్షితంగా దిగిన మాడ్యూల్

అమరావతి: ఇస్రో నింగిలోకి మనుషులను పంపే ప్రయోగం విజయవంతంగా నిర్వహించింది..గగన్ యాన్ మిషన్ లో భాగంగా శనివారం జరిగిన TV D1 ఫ్లయిట్ టెస్ట్ విజయవంతమైంది..ఉదయం 10 గంటలకు శ్రీహరి కోట అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు.. TV D1 క్రూ మాడ్యూల్ నిర్దేశించిన విధంగా నింగిలోకి దూసుకెళ్లి,, ఆటు తరువాత మూడు పారాచూట్ల ఆధారంతో మాడ్యూల్ బంగాళాఖాతంలో సురక్షితంగా దిగింది.. సముద్రంలో దిగిన మాడ్యుల్స్ ను ఇండియన్ నేవీ సేకరించింది..ఉదయం 8 గంటలకు వాతావరణం సరిగా లేని కారణంగా ప్రయోగాన్ని 8.45 నిమిషాలకు వాయిదా వేశారు.. 8.45 నిమిషాలకు చేపట్టిన ప్రయోగ సమయంలో రాకెట్ ఇంజిన్ లో ఇగ్నిష న్ లోపం వచ్చినట్లు ఇస్రో వెల్లడించింది.. ఇంజిన్ మండకపోవడం వల్ల అనుకున్న సమయానికి గగన్యాన్ మాడ్యూల్ పరీక్షను కొంత సమయం వాయిదా వేశారు.. అనంతరం పరీక్షను దిగ్విజయంగా నిర్వహించారు.. TV D1 ఫ్లయిట్ సక్సెస్ వల్ల గగన్యాన్ మిషన్కు మరింత ఉత్తేజం ఇచ్చిందంటూ ఇస్రో చైర్మెన్ సోమనాథ్ సంతోషం వ్యక్తం చేశారు.. సాంకేతిక లోపాన్ని అత్యంత వేగంగా కనుగొనడం ద్వారా చాలా తక్కువ సమయంలోనే పరీక్షను విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *