AMARAVATHIDISTRICTS

ఓటరు డ్రాఫ్ట్ రోల్ 2024 జాబితా విడుదల చేసిన కమిషనర్ వికాస్ మర్మత్

నెల్లూరు: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని సిటీ అసెంబ్లీ నియోజకవర్గం-117, ఓటర్ మూల జాబితా రోల్-2024 లిస్ట్ ను కమిషనర్ వికాస్ మర్మత్ శుక్రవారం విడుదల చేసారు..అనంతరం కమిషనర్ మాట్లాడుతూ విడుదల చేసిన ఓటరు జాబితాలను సంబంధిత అన్ని పోలింగ్ స్టేషన్లతో పాటు నగర పాలక సంస్థ కార్యాలయంలో ప్రచురణకు ఉంచామని తెలిపారు. బిఎల్ వోల నిర్వహణలో ఇంటింటి విచారణ అనంతరం, అన్ని రకాల ఫారంలను క్షుణ్ణంగా పరిశీలించి జాబితాను రూపొందించామని తెలిపారు. సవరణల అనంతరం జాబితా తుది దశకు చేరిన నూతన జాబితాను ఓటర్లందరూ పరిశీలించుకుని వివరాలను సరిచూసుకోవాలని కమిషనర్ సూచించారు. జనవరి 5,2024వ తేదీనాటికి జాబితా సవరణలను పూర్తి చేసి ఫైనల్ డ్రాఫ్ట్ రోల్ ను ప్రకటిస్తామని కమిషనర్ వెల్లడించారు..ప్రస్తుత జాబితాలో చేర్పులు ఉన్నవారు సంబంధిత బి.ఎల్.ఓ లను సంప్రదించి సవరణలకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను అందజేయాలని కమిషనర్ సూచించారు. ఓటరు డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ చేయు నిమిత్తం గా ఏ.ఈ.ఆర్.ఓ లు దేవీ కుమారీ, ధనుంజయ రెడ్డి, దశయ్య, ఎలక్షన్ డి.టి మాధవి,చక్రపాణి, టౌన్ ప్లానింగ్, cఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *