AMARAVATHIHYDERABADPOLITICS

మాదిగల వర్గీకరణ కోసం త్వరలోనే కమిటీ ఏర్పాటు చేస్తాం-ప్రధాని మోదీ

హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని,, మాదిగల వర్గీకరణ కోసం త్వరలో కమిటీ వేస్తామని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హామీ ఇచ్చారు.. శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఎస్సీ ఉపకులాల విశ్వరూప మహాసభకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కిషన్ రెడ్డి, ఈటల, బండి సంజయ్, లక్ష్మణ్, మందకృష్ణ మాదిగ హాజరయ్యారు..ఈ సందర్బంలో ప్రధాని మాట్లాడుతూ ఎస్సీల పోరాటానికి త్వరలోనే ముగింపు పలుకుతామని చెప్పారు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ లు దళిత ద్రోహి పార్టీలని,,5 దశాబ్దలుగా కాంగ్రెస్ దళితులను మోసం చేస్తుంనే వున్నదని ప్రధాని విమర్శించారు..దళితుల్లో పేదరిక నిర్మూలన లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు..30 సంవత్సరాలుగా ఒకే లక్ష్యంతో పోరాటం చేస్తున్న మందకృష్ణ నిజమైన యోధుడు..
ఇంతగా ఆత్మీయత చూపించిన మాదిగ సమాజానికి ధన్యవాదాలు..ఎంతో ప్రేమతో ఈ సభకు నన్ను ఆహ్వానించారు.. స్వాతంత్ర్యం వచ్చాక అనేక ప్రభుత్వాలను చూశారు..ఆ ప్రభుత్వాలకు,, మా ప్రభుత్వానికి తేడా గమనించాలని కోరారు.. సామాజిక న్యాయానికి బీజేపీ కట్టుబడి ఉందని,,సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అనేది మా విధానం అన్నారు.. మాదిగల పోరాటానికి మా సంపూర్ణ మద్దతు వుంటుందని చెప్పారు..న్యాయం చేస్తామని చెప్పి అనేక పార్టీలు మిమ్మల్ని వాడుకున్నాయి,,పార్టీలు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసేందుకు ఇక్కడికి వచ్చాను,, ఇకపై మీరు ఏదీ అడగాల్సిన అవసరం లేదన్నారు..సామాజిక న్యాయం దిశగా అడుగులు వేస్తున్నామని ప్రధాని మోదీ వెల్లడించారు.
అభివృద్ధి విషయంలో పలు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటాయి కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వంతో కలసి లిక్కర్ స్కామ్ లో కోట్ల రూపాయల అవినితికి పాల్పపడుతొందని ఆరోపించారు..ఇలా అవినీతి కోసం ప్రభుత్వాలు కలిసి పని చేయడం మొదటిసారి చూస్తున్నామని పేర్కొన్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *