AMARAVATHINATIONAL

ఉత్తరాఖండ్ సొరంగంలో చిక్కుకున్న కార్మికులు క్షేమం-సి.ఎం పుష్కర్ సింగ్ ధామి

అమరావతి: ఈ నెల 12వ తేదిన ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులు సురక్షితంగా వున్నట్లు సంబంధిత నిర్మాణ సంస్థ ఫోటోలను విడుదల చేసింది..10 రోజులుగా సొరంగంలోనే ఉండిపోయిన 41మంది కార్మికులు పరిస్థితి ఎలా ఉందోనని, వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్న నేపధ్యంలో వారిని సురక్షితంగా రక్షంచేందుకు అధికారులు నిర్వరామంగా కృషి చేస్తున్నారు..నేషనల్ హైవేస్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHIDCL) డైరెక్టర్ అన్షు మనీష్ ఖల్ఖో మాట్లాడుతూ కార్మికులు ఎలా ఉన్నారనే విషయం తెలుసుకునేందుకు పైప్ లైన్ ద్వారా ఎండోస్కోసిక్ కెమెరాలను పంపిచినట్లు చెప్పారు.. బయటికొచ్చిన విజువల్స్ లో సొరంగంలో చిక్కుకున్న కార్మికులు సురక్షితంగా ఉండడంతో వారి కుటుంబసభ్యులకు పెద్ద ఊరట లభించింది..ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా ఉత్తరకాశీ సొరంగం రెస్క్యూ ఆపరేషన్ గురించి ఎక్స్(ట్విట్టర్)లో ఆప్ లోడ్ చేశారు..”మొదటి సారిగా ఉత్తరకాశీలోని సిల్క్యారాలో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిన ఘటనలో శిథిలాల్లో చిక్కుకున్న కార్మికుల విజువల్స్ బయటకొచ్చాయి..కార్మికులందరూ పూర్తిగా సురక్షితంగా ఉన్నారు, త్వరలో వారిని క్షేమంగా బయటకు తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తున్నాము,” అని ఆయన తెలిపారు.. ఈ రెస్క్యూ ఆపరేషన్ గురించి ఇన్ ఛార్జ్ అధికారి కల్నల్ దీపక్ పాటిల్ మాట్లాడుతూ కార్మికులంతా క్షేమంగానే ఉన్నారని,,వారిని త్వరలోనే సురక్షితంగా కాపాడతామని తెలిపారు,, వారితో కమ్యునికేషన్ కోసం మొబైల్ లు, ఛార్జర్లను పైపు ద్వారా పంపిస్తామని తెలిపారు.. సొరంగంలో ఉన్న కార్మికులు ఇప్పటి వరకు డ్రైఫ్రూట్స్ , నీళ్లతోనే జీవిస్తున్నారని,, సోమవారం వారికి గాజు సీసాలలో వేడి వేడి కిచ్డీని పంపించామన్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *