AMARAVATHINATIONAL

లష్కరే తోయిబాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన ఇజ్రాయెల్

” 26/11 ముంబయి దాడుల విషాదం తాలుకు 15వ సంస్మరణ” రోజు..
అమరావతి: ఉగ్రవాదులకు అందండలు అందిస్తు,,భారతదేశంలో మారణకాండ సృష్టించేందుకు పాకిస్తాన్ తన దేశం నుంచి పలు ఉగ్రసంస్థలకు ప్రొత్సహిస్తుంది అనేందుకు వందల కొద్ది సంఘటనలు ఉదహరణగా నిలుస్తున్నాయి.. పాకిస్తాన్ ప్రొదల్భంతో పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ అయిన (LeT) లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు 2008 నవంబరు 26వతేదీ ముంబయి నగరంపై దాడి చేసి 15 సంవత్సరాలు పూర్తి కావస్తున్నాయి..(174 మంది మరణించగా 300 మంది తీవ్రగాయలు పాలైయ్యారు) ” 26/11 ముంబయి దాడుల విషాదం తాలుకు 15వ సంస్మరణ” రోజు జరుపుకోనున్న సమయంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం, పాక్ లష్కరే తోయిబాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిందని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.. లష్కరే తోయిబాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడానికి అవసరమైన అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయని, భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక అభ్యర్థన లేకుండా స్వతంత్రంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం పేర్కొంది..

లష్కరే తోయిబా మరణాకాండలో 20 మంది భద్రతా సిబ్బంది,, 26 మంది విదేశీయులతో సహా 174 మంది (ఇందులో 128 మంది భారతీయులు) మరణించారు..300 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.. 2008వ సంవత్సరం నవంబర్ 26 వతేదీన జరిగిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు ముంబయిలో జరిపిన దాడులు హేయమైనవని ఇజ్రాయెల్ పేర్కొంది.. 26/11 ఉగ్రదాడి సందర్భంగా ముంబయిలోని చాబాద్ హౌస్ వద్ద జరిగిన ఉగ్రదాడుల సమయంలో బాధితులైన ఆరుగురు యూదుల్లో ఇద్దరు ఇజ్రాయెల్ జాతీయులు కూడా ఉన్నారు.. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం తీవ్రవాద బాధితులందరికీ, ప్రాణాలతో బయటపడిన, ముంబయి దాడుల్లో మరణించిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని,,సంతాపాన్ని తెలియజేసింది..శాంతియుత ప్రపంచ భవిష్యత్తు కోసం తాము భారతదేశంతో కలిసి పనిచేస్తామని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.

.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *