AMARAVATHINATIONAL

ఢిల్లీ హైకోర్టులో జైల్లో వున్న ఢిల్లీ సి.ఎం కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ

అమరావతి: ఢిల్లీ హైకోర్టులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది..ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు..మంగళవారం ఆ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది..ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ అయనను అరెస్టు చేయడం, ఆటు తరువాత రిమాండుకు తరలించడం చట్ట విరుద్ధం కాదని స్పష్టం చేసింది..ఈ కేసులో ఇరుపక్షాల వాదనులు విన్న జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ధర్మాసనం, ఈడీ సేకరించిన ఆధారాలు ద్వారా, ఇతరులతో కలిసి అరవింద్​ కేజ్రీవాల్​ కుట్రపన్నారని తెలుస్తోందని అభిప్రాయపడింది.. కేజ్రీవాల్​ వ్యక్తిగతంగా, ఆప్​ కన్వీనర్​ హోదాలో కుంభకోణంలో క్రియాశీలకంగా పాలుపంచుకున్నారని పేర్కొంది.. అంతే కాకుండా ఇతర నిందితులు అప్రూవర్​లుగా మారడంపై కేజ్రీవాల్​ లేవనెత్తిన అభ్యంతరాన్ని కోర్టు తప్పుబట్టింది..అప్రూవర్​ను క్షమించడం ఈడీ పరిధిలో లేదన్న కోర్టు అది న్యాయ ప్రక్రియని తెలిపింది..అప్రూవర్​లకు క్షమాపణ ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తే, న్యాయమూర్తిపై అనుమానాలు లేవనెత్తినట్టేనని మందలించింది.. కేజ్రీవాల్​ దర్యాప్తునకు సహకరించకపోవడం, ఆయన వల్ల జరిగిన జ్యాప్యం కూడా జ్యుడీషియల్​ కస్టడీలో ఉన్నవారిపై ప్రభావం చూపుతోందని కోర్టు తెలిపింది.. విచారణలో ముఖ్యమంత్రికి ఒక న్యాయం,, సాధారణ పౌరుడికి ఒక న్యాయం ఉండడం కుదరదని హైకోర్టు వ్యాఖ్యనించింది..ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ప్రత్యేకంగా హక్కులు ఏవీ ఉండబోవంటూ కీలక వ్యాఖ్యలు చేసింది..విచారణ ఎలా జరగాలన్న విషయాన్ని నిందితుడు చెప్పాల్సిన అవసరం లేదని కోర్టు ఘాటుగా వ్యాఖ్యనించింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *