AMARAVATHINATIONAL

బాలేశ్వర్‌ మహాదేవ్‌ ఆలయం వద్ద ఆక్రమ కట్టడాలను బుల్ డోజర్లతో కూల్చివేత

అమరావతి: మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లోని బాలేశ్వర్‌ మహాదేవ్‌ ఆలయం పరిసరాల్లోని అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు 5 బుల్డోజర్లు చేరుకున్నాయి..స్థానికుల నుంచి నిరసనలు చెలరేగే ఆవకాశలు వుండడంతో,భారీ ఎత్తున పోలీసు బలగాలు చేరుకున్నాయి..ఇలాంటి దుర్ఘటలు భవిష్యత్ లో చోటు చేసుకోకుండా ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ కఠినంగా వ్యవహరిస్తున్నారు..సంఘటనా స్థలంలోనే మున్సిపల్ కమిషనర్, జిల్లా మేజిస్ట్రేట్, ఇతర ఉన్నతాధికారులు కూల్చివేత ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు..మార్చి 31వ తేదిన శ్రీరామ నవమి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి రావడంతో,,మెట్లబావిను కవర్‌ చేస్తూ ఏర్పాటు చేసిన పైకప్పు భక్తుల బరువును ఆపలేక కుప్పకూలింది..  కూలిన శ్లాబ్ తో పాటు బావిలో పడి ఘటనలో ఇప్పటిదాకా 36 మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు.. 100సంవత్సరాల చరిత్ర ఉన్న బాలేశ్వర్‌ మహాదేవ్‌ ఆలయం,,ఇండోర్‌ స్నేహ్‌నగర్‌లో పాత కాలనీల మద్య ప్రైవేట్‌ ట్రస్ట్‌ ఆధీనంలో నడుస్తోంది..మెట్ల బావి లోతు దాదాపు 40 అడుగుల వరకు వుంటుంది అధికారులు పేర్కొన్నారు..

ఆలయంలోని పరిస్థితులపై గతంలోనే తాము ఫిర్యాదులు చేశామని, మున్సిపల్‌ అధికారులు సకాలంలో స్పందించి ఉంటే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..ఇండోర్‌ మున్సిపల్‌ అధికారులు మాత్రం గత సంవత్సరం ఏప్రిల్‌లోనే అక్రమ కట్టడాలకు సంబంధించి,ఆలయ ట్రస్ట్‌కు నోటీసులు జారీ చేశామని,,అందుకు సంబంధించిన కాపీని చూపిస్తున్నారు.. ట్రస్ట్‌ సభ్యులు మాత్రం ఆ వాదనను తోసిపుచ్చుతు,,మతపరమైన విషయాల్లో ఇండోర్‌ మున్సిపాలిటీ జోక్యం ఎక్కువగా ఉంటోందని ఆరోపిస్తోంది..   

ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రూ.5 లక్షల రూపాయల పరిహారం,,గాయపడినవాళ్లకు యాభై వేల రూపాయల పరిహారంతో పాటు చికిత్స ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది..ఈ ఘటనపై మెజిస్ట్రేట్‌ విచారణకు ఆదేశించారు..ఇదే సమయంలో PM NRF నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వాళ్లకు రూ.50 వేలు ప్రకటించింది..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *