INTERNATIONALSPORTS

అదృష్టం సెమీఫైనల్స్ కి చేర్చిన-ఫైనల్స్ లో పరాజయంపాలైన పాక్

T20 వరల్డ్ కప్ 2022..

అమరావతి: లీగ్ దశలోనే ఇంటి ముఖం పటాల్సిన పాక్ జట్టుకు అనుకొని ఆవకాశం రావడంతో,ఫైనల్స్ కు చేరుకుంది.ఫైనల్స్ లో ఇంగ్లడ్ చేతిలో చావుదెబ్బతిన్నది.. ఆదివారం జరిగిన T20 వరల్డ్ కప్ 2022 ఫైనల్లో, పాక్పై 5 వికెట్ల తేడాతో గెలిచి పొట్టి ఫార్మాట్లో ఇంగ్లడ్ విశ్వవిజేతగా నిలిచింది. హోరా హోరీగా సాగిన ఫైనల్లో ఇంగ్లాండ్ 138 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో ఛేదించి రెండో సారి T20 వరల్డ్ కప్ టైటిల్ను సొంతం చేసుకుంది. 138 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 7 పరుగుల వద్ద అలెక్స్ హేల్స్ షాహీన్ అఫ్రిదీకి చిక్కాడు.  తర్వాత వచ్చిన సాల్ట్ 10 పరుగులు చేసి రవూఫ్ బౌలింగ్లో పెవీలియన్ చేరాడు. దీంతో ఇంగ్లాండ్ 32 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. కొద్దిసేపటికే కెప్టెన్ బట్లర్ కూడా ఔటయ్యాడు. 17 బంతుల్లోనే 26 పరుగులు చేసి మాంచి ఫామ్ చ్లో ఉన్నట్లు కనిపించిన బట్లర్ను రవూఫ్ బొల్తా కొట్టించడంతో, ఇంగ్లాండ్ 45 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కష్టాల్లో ఉన్న జట్టును బెన్ స్టోక్స్, హార్రీ బ్రూక్తో విలువైన పార్టన్నర్ షిప్ను నమోదు చేశాడు. బ్రూక్ను షాదాబ్ ఖాన్ ఔట్ చేయడంతో పాక్ అభిమానుల్లో ఆశలు చిగురించాయి. ఈ ఆనందాన్ని స్టోక్స్ ఎంతో సేపు ఉంచలేదు. మొయిన్ ఆలీతో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. చెత్త బంతులను బండరీకి తరలించి, ఇఫ్తికర్ బౌలింగ్లో సూపర్ సిక్స్ కొట్టాడు. చివర్లో మొయిన్ అలీ ఔటైనా….స్టోక్స్ ఇంగ్లాండ్ ను  విజయ తీరాలకు చేర్చాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. ఫైనల్లో  పాకిస్తాన్ బ్యాట్స్మన్ అంచనాలకు తగ్గట్లు రాణించలేకపోయారు. ఆ జట్టు ఓపెనర్లు తక్కువ స్కోరుకే పెవీలియన్ చేరారు. మహ్మద్ రిజ్వాన్ 15 పరుగులే చేసి 29వ పరుగుల వద్ద సామ్ కర్రన్ బౌలింగ్లో ఔటయ్యాడు. ఆటు తరువాత క్రీజ్ లోకి వచ్చిన హారిస్ 8 పరుగులే చేసి వెనుదిరిగాడు. దీంతో పాక్ 45 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో కెప్టెన్ బాబర్ ఆజమ్, షాన్ మసూద్ జట్టును ఆదుకున్నారు. మూడో వికెట్ కు 40 పరుగులు జోడించారు. అయితే 32 పరుగులు చేసిన కెప్టెన్ ఆజమ్ ను రషీద్ బుట్టలో వేసుకున్నాడు.బ్యాటింగ్ కు  వచ్చిన ఇఫ్తికర్ అహ్మద్ డకౌట్ అయ్యాడు. దీంతో పాక్ 85 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. షాన్ మసూద్ 38 పరుగులు, షాదాబ్ ఖాన్ 20 పరుగులు చేశారు. వీరిద్దరు ఔటైన తరువాత..పాక్ వరుసగా వికెట్లు కోల్పోయింది. చివరకు పాకిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 పరుగులే చేయగలిగింది. ఇంగ్లాండ్ బౌలర్లలో సామ్ కర్రన్ 3 వికెట్లు పడగొట్టాడు. అదిల్ రషీద్, క్రిస్ జోర్దాన్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. స్టోక్స్ ఒక వికెట్ తీశాడు. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *