AMARAVATHINATIONAL

కుక్కతో వాకింగ్​ కోసం స్టేడియం ఖాళీ చేయించిన IASను బలవంతంగా పదవీ విరమణ చేయించిన ప్రభుత్వం

అమరావతి: క్రీడాకారులు సాధన చేసే స్టేడియంను, తన కుక్కతో కలిసి వాకింగ్‌ చేసుకోవడానికి వినియోగించిన IAS అధికారిణిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది..సదరు అధికారిణితో ప్రభుత్వం బలవంతంగా రాజీనామా చేయించింది..వివరాల్లోకి వెళ్లితే…..

ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియం, సాయంత్రం 7 గంటల వరకు క్రీడాకారులు వారి కోచ్ లతో ఆధ్వర్యంలో ప్రాక్టీస్ చేసుకుంటు బిజీగా ఉంటారు..గత సంవత్సరం ఢిల్లీ రెవెన్యూ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న(IAS 1994 బ్యాచ్) సంజీవ్ ఖిర్వార్,,ఈనింగ్ వాకింగ్ చేసుకునేందుకు స్డేడియం నుంచి క్రీడాకారులు,,కోచ్ లను పంపించి వేయాలంటూ సంబంధిత స్డేడియం అధికారులను అదేశించారు..అటు తరువాత తన భార్య రింకూ దుగ్గా(IAS 1994 బ్యాచ్),పెంపుడు కుక్కతో కలసి వాకింగ్ చేసుకునేవాడు..ఈ IAS తీరుతో తమ క్రీడా శిక్షణ ఆటంకం కలుగుతుందని,,క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేశారు..అలాగే సంబంధిత శాఖ ఉన్నతధికారులకు ఫిర్యాదు చేశారు..

ఈ విషయం మీడియాలో రావడంతో,,IAS నిర్వాకంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి..దింతో ఢిల్లీ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి,,హోమ్ శాఖకు నివేదిక సమర్పించారు..నివేదిక అందిన వెంటనే కేంద్రహోంశాఖ,,ఈ IAS దంపతులపై బదలీ వేటు వేసింది..ఇందులో సంజీవ్ ఖిర్వార్ ను లఢాఖ్ కు,,అయన భార్యను రింకూ దుగ్గాను ప్రిన్సిపాల్ సెక్రటరీ,ఇండిజీనిస్ ఎఫైర్స్,అరుణాచల్ ప్రదేశ్ కు ట్రాన్స్ ఫర్ చేసింది..అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తాజాగా రింకూ దుగ్గా సర్వీస్ రికార్డ్‌ను పరిశీలించిన తర్వాత, సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (CCS) పెన్షన్ రూల్స్, 1972లోని రూల్ 48లోని ఫండమెంటల్ రూల్స్ (FR) 56(j), రూల్ 48 ప్రకారం Dugga తప్పనిసరిగా పదవీ విరమణ చేయించారు..ఇక తరువాత వేటు సంజీవ్ ఖిర్వార్ వుంటుందా??

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *