DISTRICTS

విద్యుత్‌ ఛార్జీల పెంపుతో ప్రజలపై మరింత భారం పడుతుంది-అజీజ్

నెల్లూరు: జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఏడుసార్లు విద్యుత్ చార్జీలను పెంచి, ప్రజలు కరోనా కష్టకాలంలో ఉన్నారని కూడా చూడకుండా 17093 కోట్ల అధిక భారాన్ని ప్రజలపై మోపారని నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంఛార్జి అబ్దుల్ అజీజ్ విమర్శించారు.సోమవారం రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీల పెంపును నిరసిస్తూ రాజరాజేశ్వరి దేవాలయం ఎదురుగా వున్న విద్యుత్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈసందర్భంలో అయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ విద్యుత్ చార్జీలపై బాధుడే బాదుడు అని ప్రతి ఎన్నికల ప్రచారంలో చెప్పారని, తాను వస్తే ఒక్క రూపాయి కూడా పెంచనని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు..2020 ఫిబ్రవరిలో 500 యూనిట్లు దాటిన వారిపై 90 పైసలు చార్జీల పెంపుతో 1300 కోట్ల రూపాయలు, మే నెలలో స్లాబుల మార్పుతో 1500 కోట్లు, అలాగే ఏప్రిల్ లో కిలో వాట్ కు 10 రూపాయలు పెంచి 2542 కోట్లు ప్రజల పై భారం మోపారని మండిపడ్డారు..ఐదు సంవత్సరాల వెనుక వాడిన బిల్లులను తీసుకుని వచ్చి 2014 నుండి 2019 వరకు ట్రూ అప్ చార్జెస్ పేరుతో 3669 కోట్లు ప్రజల పై భారం మోపారని ఆరోపించారు..రాబోవు మే నెలలో యూనిట్ కు 40 పైసలు చొప్పున చార్జులు పెంచబోతున్నారని, ఇది ప్రజలకు మరింత భారం అన్నారు.. రాబోవు రోజుల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *